ప్రభాస్ సినిమాలను రిజెక్ట్ చేయమంటున్నారట!

  • March 1, 2021 / 04:57 PM IST

‘బాహుబలి’ సినిమాతో ప్రభాస్ రేంజ్ ఎంతగా పెరిగిపోయిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమా తరువాత రిలీజైన ‘సాహో’ సినిమా ప్లాప్ అయినప్పటికీ భారీ కలెక్షన్స్ ని రాబట్టిందంటే అది ప్రభాస్ పుణ్యమే. ఇప్పుడు ఈ హీరోతో సినిమాలు చేయడానికి అగ్ర దర్శకులు ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ కూడా ప్రభాస్ డేట్స్ కోసం చూస్తున్నారు. ప్రస్తుతం ప్రభాస్ ‘రాధేశ్యామ్’ సినిమాను పూర్తి చేస్తున్నాడు. అలానే లైన్ లో ‘సలార్’, ‘ఆదిపురుష్’ లాంటి సినిమాలు ఉన్నాయి. అలానే నాగ్ అశ్విన్ తో సినిమా చేయనున్నాడు.

ప్రభాస్ అన్నీ కూడా పాన్ ఇండియా కథలనే ఎన్నుకుంటున్నాడు. దానికి తగ్గట్లుగా మార్కెట్ జరగడం కోసం ఇతర భాషల నటీనటులను కూడా ప్రభాస్ సినిమాల్లో తీసుకుంటున్నారు దర్శకనిర్మాతలు. టాలీవుడ్, బాలీవుడ్, శాండల్ వుడ్ ఇలా దాదాపు అన్ని ఇండస్ట్రీలలో నటీనటులు ప్రభాస్ సినిమాల్లో కనిపిస్తున్నారు. కానీ కోలీవుడ్ మాత్రం ప్రభాస్ సినిమాలను ప్రోత్సహించడం లేదని తెలుస్తోంది. విజయ్ సేతుపతి లాంటి స్టార్లకు ప్రభాస్ సినిమాల్లో ఛాన్స్ వస్తే చేయొద్దని అక్కడ ఇండస్ట్రీ పెద్దలు సలహాలు ఇస్తున్నారట.

రీసెంట్ గా కోలీవుడ్ హీరో అధర్వకి ప్రభాస్ సినిమాలో నటించే అవకాశం రాగా.. ఆ ఆఫర్ ని రిజెక్ట్ చేయమంటూ కోలీవుడ్ దర్శకనిర్మాతలు కొందరు ఈ యంగ్ హీరోకి చెబుతున్నారట. తమ ఇండస్ట్రీకి చెందిన హీరోలు ప్రభాస్ సినిమాల్లో నటించకూడదంటూ రూల్స్ కూడా పెట్టుకుంటున్నారట. కానీ ఈ విషయాలను బయటకి రానివ్వకుండా పైకి మాత్రం ప్రభాస్ సినిమాలను ఎంకరేజ్ చేస్తున్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఒకప్పుడు సౌత్ సూపర్ స్టార్స్ అంటే కోలీవుడ్ హీరోల గురించే చెప్పుకునేవారని.. కానీ ఈ జెనరేషన్ లో ప్రభాస్ ఇండియన్ స్టార్ ఎదగడం కోలీవుడ్ సర్కిల్ తట్టుకోలేకపోతుందంటూ వార్తలు వస్తున్నాయి.

Most Recommended Video

తన 11 ఏళ్ళ కేరీర్లో సమంత మిస్ చేసుకున్న సినిమాల లిస్ట్..!
నాని కొన్ని హిట్ సినిమాలను కూడా మిస్ చేసుకున్నాడు..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus