‘ఎన్టీఆర్’తో త్రివిక్రమ్ సినిమా కన్ఫర్మ్??!!!

యంగ్ టైగర్ ఎన్టీఆర్…మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే కెవ్వు కేక కదా…వారి కాంబినేషన్ లో సినిమా వస్తే…రికార్డుల పరంపర అనడంలో ఏమాత్రం సందేహం లేదు. అయితే ఈ కాంబినేషన్ కోసం ఎన్టీఆర్ ఫ్యాన్స్ మాత్రమే కాదు..యావత్ ప్రేక్షక ప్రపంచం ఎదురు చూస్తూ ఉంటుంది.

ఇదిలా ఉంటే తాజాగా వినిపిస్తున్న వార్తల ప్రకారం ఎన్టీఆర్- త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఎన్టీఆర్ సినిమా రెడీ అవ్వడానికి పునాది పడింది అని తెలుస్తుంది….వివరాల్లోకి వెళితే…నితిన్ తో “అఆ”కు ముందే త్రివిక్రంతో సినిమా చేయాలి ఎన్టీఆర్ కానీ నిర్మాత రాధాకృష్ణతో ఏదో చిన్న డిస్టబన్స్ వచ్చి వెనుకడుగు వేశాడు ఎన్టీఆర్. అయితే ప్రస్తుతం అయితే ప్రస్తుతం పూరితో తర్వాత సినిమా చేసే ఆలోచనలో ఉన్న తారక్ త్రివిక్రం సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట. ఇంతకీ ఈ కాంబినేషన్ సెట్స్ పైకి వెళ్ళేందుకు కారణం అయిన వాళ్ళు ఎవరు అంటే….నాన్నకు ప్రేమతో సినిమా నిర్మాత బి. ప్రసాద్.

ఇప్పటికీ ఎన్టీఆర్ తో నాన్నకు ప్రేమతో చేసిన ఆయన….త్రివిక్రంతో అత్తారింటికి దారేది సినిమా తీశాడు. ఇప్పుడు మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ ను తెరపైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నాడు. జూనియర్ తో సినిమా తీసేందుకు త్రివిక్రం ను ఒప్పించే ప్రయత్నాల్లో ఉన్నాడట ఈ నిర్మాత. ప్రస్తుతం పవన్, ఆ తర్వాత మహేష్ తో సినిమాకు సిద్ధమైన త్రివిక్రం జూనియర్ కు సరిపోయే కథ సిద్దం చేస్తున్నాడని సమాచారం. మరి ఏ కాంబినేషన్ సెట్ అయితే మాత్రం కేవు కేకే. చూద్దాం ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus