‘హను – మాన్’ (HanuMan) సినిమాతో పాన్ ఇండియా దర్శకుడు అయిపోయారు ప్రశాంత్ వర్మ (Prasanth Varma) . ఆ సినిమా కంటెంట్, చూపించిన విధానం, రాసుకున్న వైనం ఇలా అన్నీ పాన్ ఇండియా లెవల్‌లో జనాలకు నచ్చాయి. దీంతో నెక్స్ట్ సినిమా ఏంటి? అనే ప్రశ్న వస్తుంది అని ఊహించి ‘జై హనుమాన్’ అంటూ సీక్వెల్ ప్రకటించారు. అది ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్‌లో ఉంటుంది అంటూ తర్వాతి సినిమాల విషయంలోనూ క్లారిటీ ఇచ్చేశారు.
అయితే, ఏమైందో ఏమో ఇటీవల కాలంలో ఆయన సినిమాల ఎంపిక విషయంలో ఏవేవో డౌట్స్ వస్తున్నాయి. ‘జై హనుమాన్’ ప్రీ ప్రొడక్షన్ పనులు మొదలయ్యాయి అని ఓవైపు చెబుతూనే.. బాలీవుడ్‌లో అడుగులు వేయడానికి ట్రై చేశారు. రణ్‌వీర్ సింగ్‌తో (Ranveer Singh) మైత్రీ మూవీ మేకర్స్‌లో ప్రశాంత్ వర్మ ఓ సినిమా అనౌన్స్ చేశారు. కానీ కొద్ది రోజులకే సినిమా ఆగిపోయింది అన్నారు. ఆ తర్వాత ఆయన గతంలో మొదలుపెట్టిన ‘అధీర’ను వేరే దర్శకుడికి ఇచ్చేస్తున్నారని టాక్.
దీంతో ప్రశాంత్ వర్మకి ఏమైంది. ఎందుకు వరుసగా సినిమాలు అలా అవుతున్నాయి అంటూ డౌట్స్ వచ్చాయి. దీనికి సమాధానం కోసం చూస్తుంటే నందమూరి వారసుడు మోక్షజ్ఞ తొలి సినిమా ప్రశాంత్ వర్మదే అనే వార్త బయటకు వచ్చింది. బాలకృష్ణతో (Balakrishna) సినిమా చేద్దామని ప్రశాంత్ అనుకుంటుంటే.. అతని తనయుడిని లాంచ్ చేసే అవకాశం వచ్చింది అని కూడా మాట్లాడుకున్నారు. కానీ ఇప్పుడు ‘హను – మాన్’ నిర్మాతల మాటలు వింటుంటే, ప్రశాంత్ సన్నిహితుల మాటలు వింటుంటే చిరంజీవితో ఆయన నెక్స్ట్ సినిమా ఉండొచ్చేమో అనే మాట వినిపిస్తోంది.
‘హను – మాన్’ నిర్మాత చైతన్య రెడ్డి ఇటీవల మాట్లాఉతూ హనుమంతుడు అంటే చిరంజీవి (Chirajeevi) లేదా రామ్ చరణ్ (Ram Charan) ఊహించుకుంటున్నామని అన్నారు. దీంతో ‘జై హనుమాన్’లో ఆ ఇద్దరిలో ఒకరు పక్కా అని చెబుతున్నారు. మరి ప్రశాంత్ వర్మ మనసులో ఏ హీరో ఉన్నారు, ఏ సినిమా ఉందో తెలియాలి.