Ram Charan, Bumrah: కావాలనే బుమ్రా గురించి రామ్‌ చరణ్‌ అలా మాట్లాడాడా?

Advertisement

‘పెద్ది’ (Peddi) సినిమా ప్రచారాన్ని సినిమా టీమ్‌ భారీ స్థాయిలో చేస్తున్న విషయం తెలిసిందే. ముంబయిలో ట్రైలర్‌ లాంచ్‌తో తమ ప్లానింగ్ ఏంటో చెప్పకనే చెప్పిన టీమ్‌.. ఇటీవల భోపాల్‌లో మరో ఈవెంట్ పెట్టారు. అదేదో తెలుగు రాష్ట్రాల్లో ఈవెంట్‌ జరిగినట్లే అంత జనాలు వచ్చారు. తెలుగు హీరో సినిమా ఈవెంట్ నాన్‌ తెలుగు స్టేట్‌లో అంతమంది ప్రేక్షకులు రావడం అరుదు అనే చెప్పాలి. ఈవెంట్‌ మొదలవ్వడం సుమారు మూడు గంటలు లేటైనా అందరూ ఉన్నారు.

Ram Charan, Bumrah

అంత బాగా జరిగిన ఈవెంట్‌లో రామ్‌చరణ్‌ (Ram Charan) చేసిన రెండు తప్పులు ఇప్పుడు సోషల్‌ మీడియాలో సినిమా పేరు తెగ నానేలా చేస్తున్నాయి. ఆ రెండింటికీ రామ్‌ చరణ్‌ సమాధానం ఇచ్చేసినా.. ఎందుకలా జరిగిందో చెప్పేసినా ‘పెద్ది’ సినిమా మాత్రం సోషల్‌ మీడియాలో ట్రెండింగ్‌లోనే ఉంది. రామ్‌చరణ్‌ ఏంటి ఇలా అనేశాడు అని కొంతమంది మాట్లాడుకుంటూ ఉంటే.. చరణ్‌కి ఇది అలవాటే గతంలో అతనితో పని చేసిన చాలామంది ఈ విషయం చెప్పారు అంటూ మరో చర్చ మొదలైంది.

‘పెద్ది’ సినిమా భోపాల్‌ ఈవెంట్‌ను ఫాలో అయినవారికి ఏమైందా తెలిసే ఉంటుంది. క్రికెటర్ల గురించి ఒక్క మాటలో చెప్పాలంటూ రామ్‌చరణ్‌తో ఈవెంట్‌ హోస్ట్‌ ర్యాపిడ్‌ ఫైర్‌ పెట్టాడు. ఈ క్రమంలో చరణ్‌ కాస్త తడబడ్డారు. జస్‌ప్రీత్‌ బుమ్రా గురించి టాపిక్‌ వచ్చినప్ఉడు ‘తాను అభిమానిని అని చెప్పిన చరణ్‌.. జస్సీని ఫుట్‌బాల్‌ ప్లేయర్‌’ అని సంబోధించాడు. దీనికి సంబంధించిన వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అయితే దీనిపై స్పందిస్తూ రామ్‌ చరణ్‌ క్షమాపణలు చెప్పాడు.

నేను కొన్నిసార్లు పేర్లను మర్చిపోతుంటా. జన సందోహం, హంగామా మధ్య అనుకోకుండా పొరపాటు జరిగింది. జస్‌ప్రీత్‌ బుమ్రాకు క్షమాపణలు. ఆయన్ను నేను గౌరవిస్తాను. ఆయన ఆటకు నేను పెద్ద ఫ్యాన్‌. బ్యాటర్లు వెనకడుగు వేసేలా మీ నిలకడైన ఆటతీరు భారతీయులంతా గర్వపడేలా చేస్తోంది అని క్లారిటీ ఇచ్చాడు. దాంతోపాటు ఈవెంట్‌ నిర్వహించిన ప్రాంతం విషయంలోనూ చరణ్‌ పొరపడ్డాడు. భోపాల్‌కు బదులు బిహార్‌ అని అన్నాడు. అయితే ఆ తర్వాత తన పొరపాటును గ్రహించి మార్చుకున్నాడు.

ఇక్కడ రెండు పాయింట్లు ఉన్నాయి. ఒకటి తాను క్రికెటర్ల గురించి మాత్రమే అడుగుతా అని హోస్ట్‌ చెప్పారు.. వారి గురించే అడిగారు. మరి మధ్యలో ఫుట్‌బాల్‌ ఎందుకొచ్చింది? ఇక రెండోది బుమ్రాను సాకర్‌ ప్లేయర్‌ అని చరణ్ అన్నా.. హోస్ట్‌ ఏ మాత్రం ఆ మాటలకు రియాక్ట్‌ అవ్వలేదు. దీంతో ఇదంతా కావాలని చేశారా అనే డౌట్స్‌ వస్తున్నాయి.

బూమ్రాకి క్షమాపణలు తెలిపిన రామ్ చరణ్… ‘బన్నీ కంటే బెటరే’ అంటూ..!

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus