Sai Pallavi: డ్యాన్సర్‌, యాక్టర్‌ అనుకున్నాం.. కొరియోగ్రాఫర్‌ కూడా అయిపోయిందా?

Ad not loaded.

తెలుగు సినిమాల్లో ఆ మాటకొస్తే ఇండియన్‌ సినిమాలో బెస్ట్‌ డ్యాన్సర్లలో సాయిపల్లవి (Sai Pallavi) ఒకరు. స్వతహాగా ఆమె డ్యాన్సర్‌ కావడం, అప్పటికే టీవీ డ్యాన్స్‌లో ఆమె పాల్గొన్నారు కూడా. ఆమె డ్యాన్స్‌ అంత ఫేమస్‌ కూడా. ఈ క్రమంలో ఆమె తన సినిమాల్లోకి కొన్ని పాటలకు, సీక్వెన్స్‌లకు స్టెప్పులు కంపోజ్‌ చేసుకుంది అని ఓ వార్త సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది. ఒక సినిమా పక్కాగా చెబుతుంటే, మరో సినిమాకు సంబంధించి సమాచారం అని అంటున్నారు.

Sai Pallavi

‘తండేల్‌’ (Thandel) సినిమా వచ్చిన తర్వాత ఆమె డ్యాన్స్‌, లుక్స్‌ గురించి సోషల్‌ మీడియాలో పెద్ద ఎత్తున మాట్లాడుతున్నారు. ఈ క్రమంలోనే సాయిపల్లవి గురించి, ఆమె డ్యాన్స్‌ గురించి కూడా మాట్లాడుతున్నారు. ఇటీవల సాయిపల్లవి ‘అమరన్‌’ (Amaran), ‘తండేల్‌’ సినిమాలతో బ్యాక్‌ టు బ్యాక్‌ విజయాలు అందుకుంది. ఈ క్రమంలో ఆమె డాన్సుల గురించి మాట్లాడుతూ ఆ పాటలకు పని చేసిందా అని కొందరు ఆశ్చర్యపోతుననారు.

ఇక సాయిపల్లవి హీరోయిన్‌గా వెండితెరకు పరిచయమైన ‘ప్రేమమ్‌’ సమయంలో ఓ చిన్న పాట పాడటానికి, కొరియోగ్రఫీ (సొంతంగా) చేసుకోవడానికి సిద్ధమైంది. ఓ చిన్న పాట బిట్‌కి కొరియోగ్రఫీ కూడా చేసిందట. ‘ప్రేమమ్’ సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఆమె . సినిమాలో ఓ సీన్ కోసం, హీరో అతని ఫ్రెండ్స్‌కు సాయి పల్లవి డాన్స్ నేర్పించే సన్నివేశం ఉంటుందట. ఆ సాంగ్‌ని సాయి పల్లవి కొరియోగ్రాఫ్ చేసిందట.

అలాగే ‘లవ్‌ స్టోరీ’ (Love Story) సినిమాలోని ‘సారంగ దరియా.. ’ పాటలో కూడా ఆమె ఇన్‌పుట్స్‌ ఉన్నాయి అని అంటున్నారు. ‘శ్యామ్ సింగరాయ్’ (Shyam Singha Roy) సినిమాలో ‘ప్రణవాలయ..’ పాటకి కూడా సాయిపల్లవినే కొన్ని స్టెప్పులు కంపోజ్‌ చేసిందని అంటారు. ఇలా ఆమె నటనతోపాటు ఇతర పనులు కూడా చూసుకుంటోందట. అలా ఆమె తనలో ఉన్న ప్రొఫెషనల్‌ డ్యాన్సర్‌ను అప్పుడప్పుడు బయటకు తీసుకొస్తోందన్నమాట.

 

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus