‘సర్దార్’ను లైట్ తీసుకుంటున్నారు!

  • April 10, 2016 / 06:25 AM IST

విజయ్ హీరోగా నటించిన ‘తేరి’ సినిమా తెలుగులో ‘పోలీసోడు’ పేరుతో రిలీజ్ అవుతుంది. అలానే మంచు విష్ణు, రాజ్ తరుణ్ కలిసి నటించిన ‘ఈడో రకం..ఆడో రకం’ సినిమాను కూడా త్వరలోనే రిలీజ్ చేయాలనుకున్నారు. నిన్నటి వరకు ఈ రెండు సినిమాలను ఏప్రిల్ 14న రిలీజ్ చేయడానికి సందేహపడ్డారు. ‘సర్దార్ గబ్బర్ సింగ్’ మానియా ముందు సినిమా నిలబడడం కష్టమేమో అనుకున్నారు.
అయితే సర్దార్ టాక్ విన్న తర్వాత ఇప్పుడు ఈ సినిమాలకు ధైర్యం వచ్చేసినట్లు వుంది. ‘సర్దార్’ మొదటి ఆట అయిన వెంటనే ‘పోలీసోడు’ సినిమా ట్రైలర్ ను విడుదల చేశారు. ఇప్పుడు రెండు సినిమాలను ఏప్రిల్ 14న రిలీజ్ చేయనున్నారని ప్రకటనలు రానున్నాయి. పవన్ సినిమా వస్తోందంటే కనీసం రెండు వారల గ్యాప్ లేనిదే మరే సినిమా రాదు. కాని ఈ రెండు సినిమాలు రిలీజ్ కు రెడీ అవుతున్నాయంటే సర్దార్ ను లైట్ తీసుకున్నట్లే అనిపిస్తోంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus