బిగ్ బాస్ హౌస్ లో మూడువారాలు గడిచిపోయాయి. ముగ్గురు కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయ్యారు. ఈముగ్గురూ కూడా స్టేజ్ పైన చెప్పింది ఒకటే. షణ్ముక్ సిరి కలిసి గేమ్ ఆడద్దని. అసలు నిజంగానే వీరిద్దరూ కలిసి గేమ్ ఆడుతున్నారా అనేది ఇప్పుడు ఆడియన్స్ లో కూడా సందేహంగా మారింది. నిజానికి మొదటి కంటెస్టెంట్ గా ఎలిమినేట్ అయిన సరయు షణ్ముక్ అండ్ సిరి వీరిద్దరూ దేనికొచ్చారు కలిసి గేమ్ ఆడుకోవడానికా అంటూ ఎలిగేషన్ వేసింది. అతర్వాత ఉమాదేవి సైతం ఇదే ఇష్యూని స్టేజ్ పైన చెప్పింది. దీంతో షణ్ముక్ తను సోలోగా గేమ్ ఆడటానికి ఫిక్స్ అయిపోయాడు.
టాస్క్ జరుగుతున్నప్పుడు జెస్సీతో ఇదే విషయాన్ని షేర్ చేస్కుని చెప్పాడు షణ్ముక్. సిరికి దూరంగా ఉంటానని, నా బెడ్ కూడా మార్చుకుంటానని చెప్పాడు. అదేవిధంగా సిరితో మాట్లాడటం మానేశాడు. దీంతో సిరి వెంటపడింది. బాధపడింది. ఈవిషయం వీకండ్ నాగార్జునగారి కంటపడింది. దీంతో వీళ్ల పంటమరోసారి పండింది. ఇంకేమంది మళ్లీ కలిసిపోయారు. ఈసారి లహరి కూడా స్టేజ్ పైన చెప్పను. కానీ , మీరిద్దరూ కలిసి ఆడద్దు అంటూ షణ్ముక్ కి హింట్ ఇచ్చి స్టేజ్ పైకి వచ్చింది. మరోసారి ఇదే టాపిక్ ని తీసింది. అసలు లహరి ఎందుకు ఈ మాట అన్నది అనేది ఇప్పుడు వైరల్ గా మారింది.
నిజానికి లహరి నామినేషన్స్ లోకి వచ్చింది షణ్ముక్ ఓటు వేయడం వల్లే. లేదంటే రెండు ఓట్లతో సేఫ్ గా ఉండేది లహరి. అయితే, ఇక్కడ షణ్ముక్ లహరిని నామినేట్ చేస్తూ నీలో బెస్ట్ చూడాలని అనుకుంటున్నా, స్ట్రాంగ్ అవ్వాలి నువ్వు అంటూ నామినేట్ చేశాడు. అంతకుందు సిరి కూడా సేమ్ టు సేమ్ ఇలాంటి రీజనే చెప్పి నామినేట్ చేసింది. దీన్ని బట్టీ చూస్తే సిరి చెప్పిన రీజనే షణ్ముక్ కూడా చెప్తున్నాడా..? లేదా ఇద్దరూ కలిసే గేమ్ ఆడుతున్నారా అనేది సందేహంగా మారింది. ఇక వీకెండ్ నాగార్జున ఆడించిన షట్ ద డోర్ కాన్సెప్ట్ లో కూడా ఇద్దరూ సన్నీనే నిలబెట్టారు. మరి ఈవారం వీరిద్దరూ గేమ్ ఎలా ఆడతారు అనేది చూడాలి.