సినిమా పరిశ్రమలోకి వచ్చినప్పుడు ఎలా ఉందో.. ఇప్పుడు అలానే ఉంది. టాలీవుడ్‌లో కానీ, బాలీవుడ్‌లో కానీ ఈ మాట ఎవరికైనా సరిగ్గా నప్పుతుందా అని చూస్తే.. తొలుత వినిపించే కథానాయిక పేరు తమన్నా. ఎప్పుడో 2005లో ‘శ్రీ’ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన తమన్నా.. ఇప్పటికీ దాదాపు అలానే ఉంది. అదే ఫిగర్, అదే కర్వ్స్, అదే గ్లామర్. అయితే గత కొన్ని నెలలుగా కాస్త శరీరంలో మార్పులు వస్తూ, పోతున్నాయి. దీనిపై ఓ అవాంఛనీయ రూమర్ ఒకటి బయటకు వచ్చింది. దీనిపై ఆమె స్పందించింది కూడా.
తమన్నా బరువు తగ్గేందుకు ఒజెంపిక్ లాంటి ఇంజెక్షన్లు వాడుతోంది అనేది గత కొంతకాలంగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఎందుకంటే ఇప్పడు కాస్త లావుగా కనిపించింది, రెండు నెలలకు తిరిగి సన్నబడుతోంది తమన్నా అని చెబుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న తమన్నా దగ్గరకు ఈ విషయం ప్రస్తావనకు రాగా.. తనదైన శైలిలో స్పందించింది. ఇది ప్రతి మహిళకు జరిగే విషయమే అని, ఎందుకు అంత పెద్ద విషయం చేస్తున్నారు అని తేల్చేసింది.
15 ఏళ్ల వయసు నుండి నేను సినిమాల్లో నటిస్తున్నా. నా జీవితంలో దాచడానికి ఏమీ లేదు. టీనేజీలో స్లిమ్‌గా ఉన్నా. ఇప్పుడూ అలాగే ఉన్నాను అనుకుంటున్నా. నాకు నేను కొత్తగా కనిపించడం లేదు. మహిళల శరీరంలో ప్రతి ఐదేళ్లకు మార్పులు వస్తాయి. ఎప్పుడూ ఒకే శరీరాకృతితో కనిపించరు. అలా నా బాడీలోనూ మార్పులొస్తున్నాయి. అలా ఇప్పుడు కాస్త పొట్ట పెరిగినట్లుగా ఉంది. అంతేకానీ నా శరీరంలో ఇంకేమీ మార్పులు లేవు. అని తన ఫిజిక్ విషయంలో స్పష్టత ఇచ్చింది.
నిజానికి తమన్నా లుక్స్‌లో పెద్దగా మార్పులు అయితే కనిపించడం లేదు. అయితే ఎందుకో కానీ ఆమె ఓటీటీలకు వచ్చాక ఇలాంటి లెక్కల విషయంలో పుకార్లు షికార్లు చేస్తున్నాయి. ఇప్పుడు ఆమె క్లారిటీ ఇచ్చింది కాబట్టి ఇకనైనా ఆ మాటలు ఆగుతాయేమో చూడాలి.