Allu Arjun, Rajamouli: రాజమౌళి బన్నీ మూవీ వచ్చేది అప్పుడేనా?

  • August 13, 2021 / 05:26 PM IST

టాలీవుడ్ స్టార్ హీరోలైన ప్రభాస్, రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ లతో రాజమౌళి ఎక్కువ సంఖ్యలో సినిమాలను తెరకెక్కించగా మహేష్ రాజమౌళి కాంబో మూవీ త్వరలో మొదలు కానుంది. పవన్ రాజమౌళి కాంబో, పవన్ అల్లు అర్జున్ కాంబో కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే రాజమౌళికి కూడా ఈ హీరోలతో సినిమాలను తెరకెక్కించాలని ఉందని తెలుస్తోంది. బాహుబలి2 తర్వాత రాజమౌళి బన్నీ ఎన్టీఆర్ కాంబోను కూడా పరిశీలించారు. అయితే ఆర్ఆర్ఆర్ సినిమాలో చివరకు చరణ్ ఎన్టీఆర్ హీరోలుగా ఫైనల్ కావడం జరిగింది.

ప్రస్తుతం రాజమౌళి బన్నీతో సినిమా చేయలేకపోయినా రాబోయే రోజుల్లో ఈ కాంబోలో సినిమా అయితే వచ్చే అవకాశాలు ఉన్నాయి. సరైన స్క్రిప్ట్ సిద్ధమైతే ఈ కాంబోలో మూవీ పట్టాలెక్కే అవకాశాలు ఉంటాయి. మహేష్ రాజమౌళి కాంబో మూవీ తర్వాత ఈ కాంబినేషన్ లో మూవీ పట్టాలెక్కుతుందేమో చూడాల్సి ఉంది. మరోవైపు బన్నీ సైతం రాజమౌళి మినహా టాలీవుడ్ టాప్ డైరెక్టర్ల డైరెక్షన్ లో నటించారు. పుష్ప సినిమాతో బన్నీ పాన్ ఇండియా హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు.

పుష్ప పార్ట్1 నుంచి రిలీజైన దాక్కో దాక్కో మేక సాంగ్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ వస్తోంది. విడుదలైన కొన్ని గంటల్లోనే ఈ పాటకు రికార్డు స్థాయిలో వ్యూస్, లైక్స్ వస్తుండటం గమనార్హం. బన్నీకి జోడీగా రష్మిక మందన్నా ఈ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. చిత్తూరు బ్యాక్ డ్రాప్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది.

Most Recommended Video

నవరస వెబ్ సిరీస్ రివ్యూ & రేటింగ్!
ఎస్.ఆర్.కళ్యాణమండపం సినిమా రివ్యూ & రేటింగ్!
క్షీర సాగర మథనం సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus