Aadarsha Kutumbam: ‘మాలా..’ పాట తీసేయడానికి కారణం నిడివి కాదా… ఇంకేం అయి ఉండొచ్చు
- November 1, 2026 / 02:52 PM ISTByFilmy Focus Desk
‘ఆదర్శ కుటుంబం’ సినిమా ఫలితం ఏంటి? నమ్ముకున్న నిర్మాత నాగవంశీ పరిస్థితి ఏంటి? అనేది పక్కన పెడితే.. సినిమాకు మంచి ఓపెనింగ్స్‌కి రావడానికి కారణమైన ఓ ఎలిమెంట్ ఉంది. అదే ‘మాలా..’ సాంగ్. సినిమాకు హైప్ రావడం లేదు. వరుస వాయిదాల ఎఫెక్ట్ ఎక్కువగా ఉంది అనుకున్నప్పుడు ఆ పాటను రిలీజ్ చేశారు. అందులో నివేదా పేతురాజ్ అందాలు కుర్రకారుకి కిక్ ఇచ్చాయి. కానీ థియేటర్లలో బిగ్ స్క్రీన్ మీద ఆ కిక్‌ను ఎంజాయ్ చేద్దాం అనుకున్నవారికి షాక్ తగిలింది.
Aadarsha Kutumbam
నిజానికి ‘ఆదర్శ కుటుంబం’ సినిమాకు సంగీత దర్శకుడు తమన్ ఎనిమిది పాటలు అందించారు. సినిమా జ్యూక్ బాక్స్‌లో ఎనిమిది పాటలున్నాయి. అయితే సినిమాలో మూడే ఉన్నాయి. ఎగిరిపోయిన ఆ ఐదు పాటల్లో ‘మాలా..’ పాట కూడా ఉంది. మొత్తం షూటింగ్ చేసేసి, ప్రచారం కోసం వాడుకున్న పాటను సినిమాలో ఎత్తేయడం ఏంటో సినిమా టీమే చెప్పాలి. దీని వెనుక కారణం ఏంటా అని చూస్తే.. కొన్ని విషయాలు కనిపిస్తున్నాయి.
అవే, ఆ పాట విషయంలో వచ్చిన ట్రోలింగ్, రెండోది ఆ పాట కలరింగ్, ఎడిటింగ్ విషయంలో వచ్చిన విమర్శలు. అలాంటి కలరింగ్‌లో పాటను సిల్వర్ స్క్రీన్‌పై వేస్తే ఇంకా ఎక్కువ విమర్శలు వస్తాయి అనుకొని చిత్రబృందం ఆగిపోయింది అనే ఓ వాదనా వినిపిస్తోంది. మరోవైపు సినిమా సెకండాఫ్‌లో ఆ పాటకు నిడివి సమస్య వచ్చిందని, అందుకే తీసేశారు అని కూడా అంటున్నారు. అయితే త్రివిక్రమ్ లాంటి దర్శకుడు ఇలాంటి అంశాలు ముందుగా ఆలోచించుకోలేదా అని అంటున్నారు.
నిజానికి ‘నారాయణమ్మ..’ పాటను కూడా సినిమాలో ఇరికించారని సినిమా చూస్తే అర్థమవుతోంది. ఇప్పటికే సినిమాకు అతుకులబొంత అనే విమర్శ ఉంది. ఇప్పుడు ఇలా కొన్ని అతుకులు పక్కన పెట్టేశారు అనే కామెంట్ రావడం కూడా సినిమా పరిస్థితిని తెలియజేస్తోంది. సినిమా విడుదలైన వెంటనే ఇలా అనుకోవడం కరెక్ట్ కాదు కానీ.. ఫలితం తేలడానికి ఎక్కువ సమయం పట్టేలా లేదు.













