Tharun Bhascker: తరుణ్ భాస్కర్ నటుడిగా బిజీ అవ్వడానికి కారణం అదేనా?

తరుణ్ భాస్కర్ (Tharun Bhascker)  .. ‘పెళ్ళిచూపులు’ (Pelli Choopulu) చిత్రంతో దర్శకుడిగా మారాడు. ఈ సినిమాకి పని చేసిన వాళ్లంతా అతని ఫ్రెండ్స్ గ్యాంగే. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ అతనికి వెంటనే ఛాన్సులు రాలేదు. దీంతో మళ్ళీ అతని ఫ్రెండ్స్ గ్యాంగ్ తోనే ‘ఈ నగరానికి ఏమైంది?’ (Ee Nagaraniki Emaindhi) అనే సినిమా చేశాడు. అది కూడా బాగానే ఆడింది. అయినా అతని కెరీర్ ఊపందుకోలేదు. మళ్ళీ గ్యాప్ వచ్చింది. గతేడాది ‘కీడా కోలా’ (Keedaa Cola) తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. అది అనుకున్న రేంజ్లో ఆడలేదు.

Tharun Bhascker

అయితే డైరెక్టర్ గా అతని కెరీర్ స్పీడప్ అందుకోలేదు. కానీ నటుడిగా మాత్రం బిజీగా గడుపుతున్నాడు. ‘సీతా రామం’ (Sita Ramam) ‘మాస్ క దాస్’ (Das Ka Dhamki) .. ఇలా చాలా సినిమాల్లో నటించాడు. నటుడిగా తరుణ్ బిజీ అవ్వడం వెనుక ఓ కారణం ఉంది. అదేంటంటే.. తరుణ్ స్వతహాగా మంచి రైటర్. ఇతన్ని నటుడిగా తీసుకుంటే స్క్రిప్ట్ లో కూడా హెల్ప్ చేస్తుంటాడు. సీన్లు బాగా వస్తుంటాయి. ప్రస్తుతం తరుణ్ ‘ఓం శాంతి శాంతి శాంతి’ అనే సినిమా చేస్తున్నాడు.

ఇందులో అతనే హీరో. డైరెక్టర్, ప్రొడ్యూసర్ అంతా అతని ఫ్రెండ్సే. వాస్తవానికి ‘జయ జయ జయహే’ అనే మలయాళ సినిమాకి ఇది రీమేక్. అయితే తెలుగు ప్రేక్షకుల అభిరుచికి తగ్గట్టు స్క్రిప్ట్ డిజైన్ చేసుకున్నది తరుణ్ భాస్కరే అని టాక్. ఇక అతనికి జోడీగా ఈషా రెబ్బా (Eesha Rebba)  నటిస్తుంది. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఏదేమైనా రైటింగ్ పై గ్రిప్ ఉంటే ఇండస్ట్రీలో ఏదో ఒక రకంగా కానిచ్చేయొచ్చు అని తరుణ్ భాస్కర్ వల్ల మరోసారి ప్రూవ్ అయ్యింది అని చెప్పాలి.

నాగ చైతన్య అభిమానులకి భరోసా ఇచ్చిన బన్నీ వాస్!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus