Vijay Devarakonda: గాయాలపాలైన విజయ్ దేవరకొండ.. ఏమైందంటే?

విజయ్ దేవరకొండకి  (Vijay Devarakonda) చిన్నపాటి యాక్సిడెంట్ అయినట్లు తెలుస్తుంది. దీంతో ఫ్యాన్స్ లో ఒకింత కలవరం ఏర్పడింది అని చెప్పాలి. వివరాల్లోకి వెళితే.. విజయ్ దేవరకొండ హీరోగా ‘జెర్సీ’ (Jersey) ఫేమ్ గౌతమ్ తిన్ననూరి (Gowtam Naidu Tinnanuri) దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ‘VD12’ గా ఈ ప్రాజెక్టు తెరకెక్కుతుంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ సరికొత్తగా కనిపించబోతున్నాడు. అతని లుక్ కి సంబంధించిన పోస్టర్ బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. అది బాగా వైరల్ అయ్యింది.

Vijay Devarakonda

2025 మార్చి 28న ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఆ డేట్ కి సినిమా ఎట్టిపరిస్థితుల్లోనూ విడుదల చేయాలని విజయ్ దేవరకొండ చాలా కష్టపడి పని చేస్తున్నారు. ఈ క్రమంలో.. సినిమాలో అత్యంత కీలకమైన ఓ యాక్షన్ ఎపిసోడ్ చిత్రీకరిస్తున్న టైంలో విజయ్ కి షోల్డర్ ఇంజ్యూరీ(భుజానికి గాయం) అయినట్లు తెలుస్తుంది. అయినప్పటికీ షూటింగ్ ఆపకుండా.. ఫిజియో థెరపీ తీసుకున్న.. కొంత సమయానికి మళ్ళీ షూటింగ్లో జాయిన్ అయినట్టు తెలుస్తోంది.

నిజంగా విజయ్ డెడికేషన్ కి, అతని హార్డ్ వర్క్ కి హ్యాట్సాఫ్ కొట్టాల్సిందే. ఇటీవల జరిగిన ‘లక్కీ భాస్కర్’  (Lucky Baskhar) ప్రీ రిలీజ్ ఈవెంట్లో దర్శకుడు త్రివిక్రమ్ (Trivikram).. ‘విజయ్ దేవరకొండ చాలా గట్టోడు, కెరీర్ ప్రారంభించిన కొద్దికాలంలోనే అతను చాలా ప్రేమను.. అలాగే కొంతమంది ద్వేషాన్ని కూడా చేశాడు.’ అంటూ చెప్పుకొచ్చాడు. ‘VD12’ షోల్డర్ ఇంజ్యూరీ వార్తతో అది నిజమే అని ప్రూవ్ అయ్యింది అని చెప్పాలి.

నిఖిల్ ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ ట్రైలర్ వచ్చేసింది.. ఎలా ఉందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus