Sai Sreenivas: 2 ఏళ్ళు అయ్యింది.. ఇంకెప్పుడు కంప్లీట్ చేస్తావయ్యా బెల్లంకొండ !

బెల్లంకొండ శ్రీనివాస్ (Bellamkonda Sai Sreenivas)  కెరీర్ ప్రారంభం నుండి పెద్ద బడ్జెట్ సినిమాలు చేశాడు. కానీ పెద్ద బ్లాక్ బస్టర్ అయితే అతని ఖాతాలో లేదు. ‘అల్లుడు శీను’ (Alludu Seenu) ‘రాక్షసుడు’ (Rakshasudu)  వంటి హిట్లు ఉన్నాయి. ‘జయ జానకి నాయక’ కి (Jaya Janaki Nayaka) మంచి టాక్ వచ్చినా.. కాస్ట్ ఫెయిల్యూర్ గా మిగిలిపోయింది. బాలీవుడ్లో చేసిన ‘ఛత్రపతి’.. అతి పెద్ద డిజాస్టర్ గా మిగిలిపోయింది. ప్రస్తుతం ఇతను ‘భీమ్లా నాయక్’ (Bheemla Nayak) దర్శకుడు సాగర్ చంద్రతో (Saagar K. Chandra)  ‘టైసన్ నాయుడు’ (Tyson Naidu)  చిత్రంలో నటిస్తున్నాడు.

Sai Sreenivas

’14 రీల్స్ ప్లస్’ వారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ ప్రాజెక్టు ఎప్పుడో కంప్లీట్ అవ్వాలి. కానీ బెల్లంకొండ శ్రీనివాస్ ‘షైన్ స్క్రీన్స్’ వారితో ఇంకో మొదలుపెట్టి.. దాన్ని కూడా 50 శాతం కంప్లీట్ చేసి ఆపేశాడట. మరోపక్క ‘నాంది’ దర్శకుడు విజయ్ కనకమేడల (Vijay Kanakamedala) దర్శకత్వంలో ఓ మల్టీస్టారర్ మూవీ చేయడానికి ఓకే చెప్పాడు బెల్లంకొండ శ్రీనివాస్. ఆ సినిమా షూటింగ్లో జాయిన్ అవ్వడం కూడా జరిగిందట.

‘టైసన్ నాయుడు’ నిర్మాతలు బెల్లంకొండ శ్రీనివాస్ కోసం ఎదురుచూస్తున్నారు. ఇతను మళ్ళీ ఎప్పుడు డేట్స్ ఇస్తాడో తెలియదు. అసలు కనీసం ఇన్ఫార్మ్ చేయకుండా వేరే సినిమా షూటింగ్ కి మారడం. ఆ తర్వాత ఇంకో సినిమా షూటింగ్ కి మారడంతో నిర్మాతలు చాలా ఇబ్బంది పడుతున్నారట.

వీళ్ళు మాత్రమే కాదు ఇంకో అరడజను మంది నిర్మాతల వద్ద అడ్వాన్స్..లు తీసుకున్నాడట బెల్లంకొండ శ్రీనివాస్. వాళ్ళకి తనకి నచ్చిన స్క్రిప్టులు పంపిస్తున్నాడట. అయితే కమిట్ అయిన ప్రాజెక్టులు ఫినిష్ చేయకపోవడం వల్ల.. నిర్మాతలు కూడా ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో ఉన్నారట.

బాక్సాఫీస్.. పవన్ సినిమాకు ఓ ప్రమాదం!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus