Kasthuri: తెలుగు వాళ్ళపై ఘోరమైన వ్యాఖ్యలు చేసిన కస్తూరి!

కస్తూరి  (Kasthuri Shankar) నిత్యం వివాదాలతో వార్తల్లో నిలుస్తుంటుంది. ఈ మధ్య సీరియల్స్ లో సాఫ్ట్ గా.. కనిపిస్తున్న ఈమె.. ఒరిజినల్ గా చాలా బోల్డ్. ఏ టాపిక్ ట్రెండింగ్లో ఉంటే ఆ టాపిక్ పై నెగిటివ్ కామెంట్ చేసి.. హాట్ టాపిక్ అవ్వడం ఈమె నైజం. ఇక వివరాల్లోకి వెళితే.. ‘300 ఏళ్ల క్రితం ఓ తమిళ రాజు అంతఃపురంలో రాణులకు సేవ చేయడానికి వెళ్లారు, తెలుగువారు కూడా తమిళనాడుకు అలాగే వచ్చారు’ అంటూ ఆమె హేయమైన వ్యాఖ్యలు చేసింది.

Kasthuri

ఓ పొలిటికల్ ఈవెంట్లో భాగంగా ఆమె కరుణానిధి ఫ్యామిలీని టార్గెట్ చేసి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. అయితే తెలుగు వాళ్ళని అంతఃపురంలో రాణులకి సేవ చేయడానికి వచ్చారు అని పలకడంపై అందరూ అభ్యంతరం తెలుపుతున్నారు. ఇందుకు గాను తెలుగు సంఘాలు, ప్రజలు కస్తూరిని విమర్శిస్తున్నారు. ‘ఆమె ఓ చరిత్ర హీనురాలు, ప్రతి విషయాన్ని వివాదంగా మార్చి వార్తల్లో నిలవాలని తపిస్తుంటుంది, వెంటనే తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకుని , క్షమాపణలు చెప్పకపోతే లీగల్ గా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది’ అంటూ తెలుగు సంఘాలు, ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

ఇక తన వ్యాఖ్యలకు కస్తూరి స్పందించి.. “తెలుగు వారు అంతా నా కుటుంబంతో సమానం. డీఎంకే పార్టీ నా కామెంట్స్‌ను తప్పుగా ప్రచారం చేస్తుంది. ఇలా నన్ను నెగిటివ్ చేసి బెదిరించాలనుకుంటుంది. తెలుగు వారిపై నేను వ్యతిరేకంగా మాట్లాడానంటూ విష ప్రచారం చేయడం సరైన పద్ధతి కాదు’ అంటూ ఆమె చెప్పుకొచ్చింది.

 ‘తండేల్’ కోసం రంగంలోకి దిగిన అల్లు అరవింద్.. ‘సంక్రాంతికి వస్తున్నాం’ పోస్ట్ పోన్?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus