Nithiin: నితిన్‌ – వంశీ సినిమలో హీరో ఎక్స్‌ట్రా కాదట.. అంతకుమించి!

  • July 25, 2023 / 12:34 PM IST

గుబురు గడ్డం, రింగుల జుట్టు, సీరియస్‌ లుక్‌లో నితిన్‌ కొత్త సినిమా లుక్‌ బయటకు వచ్చింది. ఎక్స్‌ట్రార్డినరీగా ఉన్న ఈ లుక్‌ను రిలీజ్‌ చేసి… దానికి ‘ఎక్స్‌ట్రా’ అని పేరు పెట్టారు. ఉప శీర్షికగా ఆర్డినరీ మ్యాన్‌ అని కూడా పెట్టారు. ఈ పేరు ఎందుకు ఇలా పెట్టారు అనే చర్చ ఓవైపు జరుగుతుంటే… ఈ పేరులోనే సినిమా కథ ఉంది అని అంటున్నారు మరికొంతమంది. ఈ నేపథ్యంలో టాలీవుడ్‌లో, సోషల్‌ మీడియాలో వినిపిస్తున్న కథనాల ప్రకారం ‘ఎక్స్‌ట్రా’ కథ కొత్తగా ఉంటుంది, డిఫరెంట్‌గా ఉంటుంది అని చెప్పొచ్చు.

కథ విషయం తర్వాత చూద్దాం. ముందుగా సినిమా సంగతి చూస్తే… నితిన్‌ కథానాయకుడిగా వక్కంతం వంశీ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. శ్రీలీల కథానాయికగా నటిస్తోంది. సినిమా ఉందా? ఆగిపోయిందా? అంటూ ఇటీవల తెగ పుకార్లు వచ్చాయి. వాటికి కంట్రోల్‌ చేయడానికేమో 60 శాతం చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు సంబంధించి అర్జెంట్‌గా లుక్‌, నేమ్‌ రిలీజ్‌ చేసింది టీమ్‌. అదే ‘ఎక్స్‌ట్రా’. ఇక ఈ సినిమాలో నితిన్‌ రెండు రకాల పాత్రలతో కనిపిస్తాడట.

ఇక ఈ సినిమా కథ సంగతి చూస్తే.. ఈ సినిమాలో నితిన్‌ జూనియర్‌ ఆర్టిస్ట్‌గా నటిస్తున్నాడట. ఈ విషయం ఇప్పటికే లీకు రూపంలో వచ్చేసింది అనుకోండి. అయితే అలాంటి జూనియర్‌ ఆర్టిస్ట్‌ వివిధ సందర్భాలు, కారణాలు వల్ల హీరో అవుతాడట. అయితే ఎందుకు అయ్యాడు, ఎలా అయ్యాడు, అప్పటివరకు ఏం చేశాడు అనే అంశాల నేపథ్యంలో సినిమా కథను సిద్ధం చేశారట వక్కంతం వంశీ. క్రిస్మస్‌ సందర్భంగా డిసెంబరు 23న ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకొస్తున్నారు.

ఇక ఈ సినిమా తర్వాత నితిన్‌ – వెంకీ కుడుముల సినిమా ఉంటుంది. ఇందులో హీరోయిన్‌గా రష్మిక మందనను తీసుకున్నా… ఆ తర్వాత వివిధ కారణాల వల్ల ఆమె తప్పుకుంది అంటున్నారు. అందులో కూడా శ్రీలీలనే కథానాయికగా ఎంపిక చేశారు అని సమాచారం. త్వరలో దీనిపై క్లారిటీ వస్తుంది.

ఆ హీరోల బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్ అవుతారు..!

‘బ్రో’ తో పాటు ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలు/ సిరీస్ ల లిస్ట్
తమ్ముడి కూతురి పెళ్ళిలో సందడి చేసిన శ్రీకాంత్ ఫ్యామిలీ.. వైరల్ అవుతున్న ఫోటోలు!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus