Trivikram: ఆ హీరోయిన్లకు త్రివిక్రమ్ ఛాన్స్ ఇవ్వలేదా..?

ఇండస్ట్రీలో సినిమాలను తెరకెక్కించే దర్శకులు, నిర్మాతలు, హీరోలు తమ సినిమా హిట్ అవ్వాలనే ఉద్దేశంతో ఎన్నో సెంటిమెంట్లను ఫాలో అవుతూ ఉంటారు. అలా త్రివిక్రమ్ శ్రీనివాస్ హీరోయిన్లు, టైటిల్స్ విషయంలో సెంటిమెంట్ ను ఫాలో అవుతుంటారు. తన డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా హిట్ అయితే ఆ సినిమా హీరోయిన్లకు త్రివిక్రమ్ తరువాత సినిమాల్లో కూడా ఛాన్స్ ఇస్తుంటారు. ఒకవేళ ఏదైనా కారణం వల్ల సినిమా ఫ్లాప్ అయితే మాత్రం ఆ హీరోయిన్లకు త్రివిక్రమ్ అవకాశాలు ఇవ్వలేదు.

ఖలేజా ఫ్లాప్ తర్వాత అనుష్కకు అజ్ఞాతవాసి ఫ్లాప్ తర్వాత కీర్తి సురేశ్, అను ఇమ్మాన్యుయేల్ లకు త్రివిక్రమ్ తన సినిమాల్లో ఛాన్స్ ఇవ్వలేదు. మరోవైపు త్రివిక్రమ్ తన సినిమాల టైటిల్స్ అ అనే అక్షరంతో ప్రారంభం అయ్యే విధంగా జాగ్రత్తలు తీసుకుంటారు. త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కిన అతడు, అత్తారింటికి దారేది, అఆ, అజ్ఞాతవాసి, అరవింద సమేత వీరరాఘవ, అల వైకుంఠపురములో సినిమాలు అ అక్షరంతో మొదలై తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ఎన్టీఆర్ త్రివిక్రమ్ కాంబినేషన్ సినిమాకు సైతం అయినను పోయిరావలె హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ అయినట్టు వార్తలు వినిపించగా ఆ సినిమా కొన్ని కారణాల వల్ల ఆగిపోయింది. అయితే మహేష్ సినిమాకు మాత్రం త్రివిక్రమ్ సెంటిమెంట్ ను విడిచిపెట్టి పార్థు అనే టైటిల్ ను ఫిక్స్ చేశారని వినిపిస్తోంది. మరోవైపు ఈ సినిమా టైటిల్ పార్థు కాదని అతడే ఆమె సైన్యం అని కూడా ఇండస్ట్రీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. త్రివిక్రమ్ టైటిల్ సెంటిమెంట్ కు దూరమవుతున్నారా..? లేదా..? తెలియాలంటే మాత్రం అధికారికంగా టైటిల్ ను ప్రకటించే వరకు ఆగాల్సిందే.

Most Recommended Video

‘పవన్ కళ్యాణ్’ హీరోగా రూపొందిన 11 రీమేక్ సినిమాలు మరియు వాటి ఫలితాలు..!
పెళ్లయ్యి కూడా పెళ్లి కానట్టు ఉండే 10 మంది టాలీవుడ్ భామల లిస్ట్..!
‘జెర్సీ’ లోని ఈ 15 ఎమోషనల్ డైలాగ్స్ ను ఎప్పటికీ మరచిపోలేము..!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus