ఇంకొక్కడు కోసం విక్రమ్ చేసిన రిస్క్!

పరాజయాలు ఎదురైనా, ప్రాణాలకు ముప్పు కలిగినా ప్రయోగాలు, రిస్క్ లు చేయడానికి వెనుకాడేది లేదని చెప్పే విక్రమ్ చేసిన తాజా చిత్రం ఇరుముగన్. ఇంకొక్కడు గా తెలుగులో అనువాదం అవుతోంది. ఇందులో విక్రమ్ “రా” ఏజెంట్ అఖిల్, శాస్రవేత్త లవ్ గా రెండు పాత్రల్లో నటిస్తున్నాడు. ట్రైలర్ లో హిజ్రా గా విక్రమ్ కనిపించిన తీరు  సినిమాపై ఆసక్తిని పెంచింది. “ఈ చిత్రం తమిళ వెర్షన్ లో రెండు పాత్రలకు విక్రమ్ డబ్బింగ్ చెప్పారు. అయితే తెలుగులో లవ్ పాత్రకు ఎంతమంది డబ్బింగ్ ఆర్టిస్ట్ లను ట్రై చేసిన సెట్ కాలేదు. దీంతో విక్రమ్ ఆ పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఆయన చేసిన ఈ రిస్క్ పాత్రకు కొత్త ఫీలింగ్ ని అందించింది” అని చిత్ర దర్శకుడు ఆనంద శంకర్ చెప్పారు.

అపరిచితుడులో స్ప్లిట్ పర్సనాలిటీ, ఐ చిత్రంలో కురూపి పాత్రలకు ఎంత పేరు వచ్చిందో అలాగే `ఇంకొక్కడు`లో విక్రమ్ నటన ఆకట్టుకుందని వెల్లడించారు. భారీ బడ్జెట్ తో, హై టెక్నికల్ వాల్యూస్ తో రూపొందిన ఈ చిత్రంలో నయనతార, నిత్యామీనన్ హీరోయిన్లుగా నటించారు.  హ్యరీష్ జైరాజ్ సంగీతం అందించిన ఈ యాక్షన్ థ్రిల్లర్ మూవీని  తెలుగులో ఎన్.కె.ఆర్.ఫిలింస్ బ్యానర్ అధినేత నీలం కృష్ణారెడ్డి  సెప్టెంబర్ 8న రెండు తెలుగు రాష్ట్రాల్లో గ్రాండ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమా విదేశాల్లో ఒక రోజు ముందుగానే విడుదల కానుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus