బాలీవుడ్ స్టార్ హీరో హృతిక్ రోషన్ తో (Hrithik Roshan) కలిసి ‘వార్ 2’ (War 2) సినిమాలో నటిస్తున్నాడు ఎన్టీఆర్(Jr NTR) . హిందీలో ఎన్టీఆర్ చేస్తున్న స్ట్రైట్ మూవీ ఇది. ‘ఆర్.ఆర్.ఆర్’ (RRR) ‘దేవర’ తో (Devara) హిందీలో ఎన్టీఆర్ కి కొంత మార్కెట్ ఏర్పడింది. దాన్ని బలోపేతం చేసుకునేందుకు ఎన్టీఆర్.. ‘వార్ 2’ సెకండ్ హీరో టైపు రోల్ చేస్తున్నాడు. ‘బ్రహ్మాస్త్ర’ ఫేమ్ అయాన్ ముఖర్జీ దీనికి దర్శకుడు. ‘యష్ రాజ్ ఫిలిమ్స్’ సంస్థ నిర్మిస్తోంది. ఆదిత్య చోప్రా (Aditya Chopra) కథ అందించిన ఈ సినిమాకి శ్రీధర్ రాఘవన్ స్క్రీన్ ప్లేని సమకూర్చారు.
ఇటీవల ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా ‘వార్ 2’ నుండి చిన్న గ్లింప్స్ వదిలారు. అయితే దీనికి నెగిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎన్టీఆర్ లుక్స్ అలాగే అతని స్టంట్స్ పై విమర్శలు కురిశాయి. ‘హృతిక్ ముందు ఎన్టీఆర్ కటౌట్ సెట్ అవ్వదేమో అనే ఉద్దేశంతో ఎక్కువగా అతని డూప్ తో యాక్షన్ సీన్స్ చేయించినట్టు ఉన్నారు’ అంటూ కొంతమంది ఎన్టీఆర్ ను ట్రోల్ చేశారు.
ఆ ట్రోలింగ్ సంగతి ఎలా ఉన్నా.. ‘వార్ 2’ టీజర్లో వి.ఎఫ్.ఎక్స్ వర్క్ కూడా అంతగా బాలేదు. విజువల్స్ క్వాలిటీగా అనిపించలేదు అనే అభిప్రాయాలూ వ్యక్తమయ్యాయి. మరోపక్క యూట్యూబ్లో వ్యూయర్షిప్ కూడా నమోదు కాలేదు. దీంతో చిత్ర బృందం అలర్ట్ అయినట్లు తెలుస్తుంది. క్వాలిటీ విషయంలో మరోసారి చెక్ చేసుకోవడం బెటర్ అనే ఆలోచనకి వచ్చింది.
ఈ నేపథ్యంలో ‘వార్ 2’ కి రీ షూట్లు వంటివి కూడా నిర్వహించే అవకాశం ఉంది. అందువల్ల ముందుగా అనౌన్స్ చేసినట్టు ఆగస్టు 14న ‘వార్ 2’ వస్తుంది అని కచ్చితంగా చెప్పలేం అనే టాక్ బాలీవుడ్ మీడియా నుండి వినిపిస్తోంది.