‘రోగ్‌’ హీరో ఇషాన్‌ ఫస్ట్‌ లుక్‌ విడుదల

డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో ఇషాన్‌ హీరోగా జయాదిత్య సమర్పణలో తన్వి ఫిలింస్‌ పతాకంపై డా|| సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి నిర్మిస్తున్న లవ్‌ ఎంటర్‌టైనర్‌ ‘రోగ్‌'(మరో చంటిగాడి ప్రేమకథ). ఇటీవల విడుదలైన ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌కి, మోషన్‌ పోస్టర్‌కి ట్రెమండస్‌ రెస్పాన్స్‌ వస్తోంది. ఈ చిత్రం ద్వారా హీరోగా పరిచయమవుతున్న ఇషాన్‌ ఫస్ట్‌లుక్‌ను ఈరోజు విడుదల చేశారు. త్వరలోనే రోగ్‌ చిత్రాన్ని తెలుగు, కన్నడలో విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.

ఇషాన్‌ హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో మన్నారా చోప్రా, ఏంజెలా హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో అనూప్‌సింగ్‌, ఆజాద్‌ ఖాన్‌, పోసాని క ష?మురళి, అలీ, సత్యదేవ్‌, సుబ్బరాజ్‌, రాహుల్‌ సింగ్‌, తులసి, రాజేశ్వరి, సందీప్తి తదితరులు ఇతర తారాగణంగా నటిస్తున్న ఈ చిత్రానికి ప్రొడక్షన్‌ కంట్రోలర్‌: బి.రవికుమార్‌, ఆర్ట్‌: జానీ షేక్‌, ఎడిటర్‌: జునైద్‌ సిద్ధిఖీ, మ్యూజిక్‌: సునీల్‌కశ్యప్‌, సినిమాటోగ్రఫీ: ముఖేష్‌.జి, నిర్మాతలు: సి.ఆర్‌.మనోహర్‌, సి.ఆర్‌.గోపి, దర్శకత్వం: పూరి జగన్నాథ్‌.

Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus