దర్శకులు పూరీ జగన్నాధ్ “ఇస్మార్ట్ శంకర్” ప్రీరిలీజ్ ఈవెంట్ లో పేర్కొన్నట్లు.. “టెంపర్” తర్వాత ఆయనకు నిజంగానే మంచి హిట్ అనేది లేదు. దాంతో పూరీ మళ్ళీ కమ్ బ్యాక్ అవ్వడం కష్టమే అనుకొన్నారు జనాలు. కానీ.. “ఇస్మార్ట్ శంకర్”తో మళ్ళీ మాస్ డైరెక్టర్ గా పూరీ విల్ బీ బ్యాక్ అంటున్నారు ఇండస్ట్రీ ఇన్సైడ్ సోర్సస్. నిజానికి “ఇస్మార్ట్ శంకర్” ఫస్ట్ ట్రైలర్ విడుదలైనప్పుడు సినిమా మీద ఎలాంటి అంచనాలు లేవు. కానీ.. రెండో ట్రైలర్ సినిమా జాతకాన్ని మార్చేసింది. ఆల్రెడీ ఈ సినిమాకి జరిగిన బిజినస్ ప్రకారం సినిమా సూపర్ హిట్ అని పేర్కొంటున్నారు జనాలు.
నైజాం-7.20 కోట్లు, సిడెడ్-3.30 కోట్లు, ఆంధ్రా-7.00 కోట్లు, శాటిలైట్ – 8.00 కోట్లు, డిజిటల్ రైట్స్ – 4.00 కోట్లు, కర్ణాటక – 2.00 కోట్లు, హిందీ డబ్బింగ్ – 6.00 కోట్ల రూపాయల బిజినెస్ ఇప్పటికే పూర్తి చేసిన “ఇస్మార్ట్ శంకర్” ఆల్రెడీ 38 కోట్ల రూపాయలు సంపాదించేసింది. ఎలాగో పూరీ మార్క్ ఫైట్స్ & హీరోయిజం పుష్కలంగా ఉంటాయి కాబట్టి బి,సి సెంటర్స్ లో ఈ సినిమా కనీసం ఓ నాలుగు రోజులు హల్ చల్ చేయడం ఖాయం కాబట్టి. రామ్ కెరీర్ లో “ఇస్మార్ట్ శంకర్” బిగ్గెస్ట్ హిట్ గానూ, పూరీని మళ్ళీ ఫామ్ లోకి తీసుకొచ్చిన సినిమాగా మిగిలిపోతుంది.