Rakul Preet: రకుల్‌కి షాక్‌.. జీతాలు ఇవ్వడం లేదంటూ సోషల్‌ మీడియాకి ఎక్కిన మహిళ

ప్రముఖ కథానాయిక.. ఇటీవల ప్రముఖ నిర్మాత జాకీ భగ్నానీ వివాహం చేసుకున్న రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ (Rakul Preet Singh) లేనిపోని ఇబ్బందుల్లో పడుతుందా? ఏమో సోషల్‌ మీడియాలో ఆమెకు చెందిన ప్రొడక్షన్‌ హౌస్‌ మీద తీవ్ర విమర్శలు వస్తున్న నేపథ్యంలో అలానే అనిపిస్తోంది. సోషల్‌ మీడియాలో కనిపిస్తున్న కొన్ని విమర్శల విషయంలో రకుల్ ప్రీత్ సింగ్, ఆమె భర్త నిర్మాత జాకీ భగ్నానీ కార్నర్ అయ్యారు. జాకీకి చెందిన నిర్మాణ సంస్థ పూజా ఎంటర్‌టైన్మెంట్స్‌పై సోషల్ మీడియాలో విమర్శలు వస్తున్నాయి.

కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్‌లో అగ్రగామి నిర్మాణ సంస్థగా కొనసాగుతున్న బ్యానర్‌లో ఉద్యోగులకు సకాలంలో జీతాలు ఇవ్వడం లేదు అనేది సోషల్‌ మీడియాలో వస్తున్న విమర్శ. పూజా ఎంటర్‌టైన్మెంట్స్‌ బ్యానర్‌పై ఇటీవల ‘బడే మియా ఛోటే మియా’ సినిమా వచ్చింది. ఈ సినిమాకు పని చేసిన చాలామంది జీతాల బకాయిలు ఇవ్వలేదని సోషల్ మీడియాలో కొంతమంది పోస్టులు పెడుతున్నారు. బాలీవుడ్‌లో ఉన్న నిబంధనల ప్రకారం, ఓ సినిమా షూటింగ్ అయిపోయిన 45 రోజుల నుండి 60 రోజుల లోపు ఆ సినిమాకు పని చేసిన వాళ్లకు బకాయిలు ఏమన్నా ఉంటే చెల్లించేయాలి.

కానీ ఇప్పటివరకు రెండు నెలల వేతనాలు అందలేదని పూజా బ్యానర్‌లో పనిచేసిన ఉద్యోగులు సోషల్‌ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. దీంతో ఏమైంది ఇలా ఎందుకు చేస్తున్నారు అనే చర్చ బాలీవుడ్‌లో మొదలైంది. కొంతమంది ఇలా గొంతెత్తడంతో సంస్థ గతంలో తమకు చేసిన అన్యాయాల్ని వివరిస్తూ మరింతమంది సోషల్ మీడియాలో రాసుకు రావడం మొదలుపెట్టారు. తనతో పాటు సినిమాలకు పని చేసిన వందమందికిపైగా సిబ్బందికి రెండేళ్ల బకాయిలు ఉండిపోయాయని మరికొంతమంది పోస్టులు చేస్తుననారు.

మూడు నెలలు పని చేస్తే ఒక నెల జీతమే ఇచ్చారనే పోస్టులు కూడా కొన్ని కనిపిస్తున్నాయి. ఇక 1986లో ఏర్పాటైన పూజా ఎంటర్‌టైన్మెంట్స్‌ సంస్థ ‘కూలీ నంబర్ 1’, ‘బడే మియా ఛోటేమియా’, ‘బీవీ నంబర్ 1’, ‘ఖామోషీ’ లాంటి హిట్‌ సినిమాలు చాలానే చేసింది. మరిప్పుడు ఎందుకు ఇలాంటి విమర్శలు వస్తున్నాయో తెలియాల్సి ఉంది. జాకీ భగ్నానీ తండ్రి వసు భగ్నానీ ఈ బ్యానర్‌ను నెలకొల్పిన విషయం తెలిసిందే.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus