మహేష్ హీరోయిన్ కు షాక్ ఇచ్చిన ఐటీ అధికారులు..!

హీరోయిన్ రష్మిక ఇంటి పై ఐటీ అధికారులు తాజాగా సోదాలు నిర్వహించారు. ఇప్పటికీ ఈ దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. ‘ఛలో’ ‘గీత గోవిందం’ వంటి సినిమాలతో ఈ బ్యూటీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇప్పుడు ఏకంగా మహేష్ బాబు వంటి స్టార్ హీరో సరసనే నటించే ఛాన్స్ కొట్టేసింది. ‘సరిలేరు నీకెవ్వరు’ పేరుతో విడుదలైన ఈ చిత్రం ఇటీవల విడుదలై హిట్ టాక్ తో దూసుకుపోతుంది.

ఇక ఈ చిత్రానికి గానూ ఈ అమ్మడికి భారీ పారితోషికాన్ని కూడా అందుకున్నట్టు తెలుస్తుంది. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు గత కొంతకాలంగా ట్యాక్స్ సరిగ్గా చెల్లించట్లేదట. ఇందుకోసమే కర్ణాటక లోని కొడుకు అనే ఊరిలోని రష్మిక ఇంటి పై సోదాలు చేస్తున్నారట. ఆమె బ్యాంక్ అకౌంట్ లు, స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్లు వంటివి చెక్ చేస్తున్నారని సమాచారం.

సరిలేరు నీకెవ్వరు సినిమా రివ్యూ & రేటింగ్!
అల వైకుంఠపురములో సినిమా రివ్యూ & రేటింగ్!
ఎంత మంచివాడవురా సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus