Itlu Maredumilli Prajaneekam Collections: డిజాస్టర్ గా మిగిలిన ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ ..!

Advertisement

వరుస ప్లాపులతో సతమతమైన అల్లరి నరేష్… ‘నాంది’ తో హిట్టు కొట్టి మళ్ళీ ఊపిరిపీల్చుకున్నాడు. తాజాగా ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ అనే మెసేజ్ ఓరియెంటెడ్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఏ.ఆర్.మోహన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం నవంబర్ 25న రిలీజ్ అయ్యింది. నవంబర్ అనేది అన్ సీజన్, పైగా ఈ సినిమాకి ప్రమోషన్లు వంటివి కూడా పెద్దగా చేయలేదు. టీజర్, ట్రైలర్ పాస్ మార్కులు వేయించుకున్నాయి కానీ బజ్ ను క్రియేట్ చేయలేకపోయాయి.

దానికి తోడు మొదటి రోజు ఈ మూవీకి మిక్స్డ్ టాక్ నమోదైంది.కలెక్షన్ల పరంగా మొదటిరోజు పర్వాలేదు అనిపించిన ఈ మూవీ రెండో రోజు నుండి డౌన్ అయ్యింది.ఆ తర్వాత కోలుకోలేకపోయింది. ఒకసారి క్లోజింగ్ కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.83 cr
సీడెడ్ 0.22 cr
ఉత్తరాంధ్ర 0.28 cr
ఈస్ట్ 0.12 cr
వెస్ట్ 0.08 cr
గుంటూరు 0.16 cr
కృష్ణా 0.19 cr
నెల్లూరు 0.08 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.96 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా + ఓవర్సీస్ 0.28 cr
వరల్డ్ వైడ్ (టోటల్) 2.24 cr (షేర్)

‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రానికి రూ.4.10 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ కావాలి అంటే రూ.4.35 కోట్ల షేర్ ను రాబట్టాల్సి ఉంది.ఫుల్ రన్ ముగిసేసరికి ఈ మూవీ కేవలం రూ.2.24 కోట్ల షేర్ ను రాబట్టింది.

సో బయ్యర్స్ కు రూ.2.11 కోట్ల నష్టాలను మిగిల్చింది ఈ చిత్రం. ‘నాంది’ తో హిట్టు కొట్టిన అల్లరి నరేష్ కు వెంటనే ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ తో డిజాస్టర్ గా ఎదురైంది.

వీరసింహారెడ్డి సినిమా రివ్యూ & రేటింగ్!
వాల్తేరు వీరయ్య సినిమా రివ్యూ & రేటింగ్!

‘ఆంధ్రావాలా’ టు ‘అజ్ఞాతవాసి’ .. సంక్రాంతి సీజన్లో మర్చిపోలేని డిజాస్టర్ గా సినిమాల లిస్ట్..!
తలా Vs దళపతి : తగ్గేదేలే సినిమా యుద్ధం – ఎవరిది పై చేయి?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus