Chammak Chandra: చమ్మక్ చంద్ర లైఫ్ లో ఇంత ట్రాజెడీ ఉందా..!

జబర్దస్త్, ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షోలకి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. వీటి తర్వాత చాలా కామెడీ షోలు వచ్చినప్పటికీ.. అందులో ఏదీ కూడా ‘జబర్దస్త్’ ని మించి సక్సెస్ కాలేకపోయింది.ఇక ‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. ‘జబర్దస్త్’ ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. సోషల్ మీడియాలో జబర్దస్త్ నటీనటులకు ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. ఇప్పుడు సినిమాల్లో కూడా వీళ్ళ హవానే ఎక్కువగా నడుస్తుంది.

ఈ షోలో నటించిన వారు నటిస్తున్న వారు.. ఇళ్లు, కార్లు, నగలు కొనుక్కోవడమే కాకుండా.. సొంతంగా యూట్యూబ్ ఛానల్స్ కూడా పెట్టేసి, చేతినిండా సంపాదించుకుంటున్నారు. వీళ్ళకి సంబంధించిన ఏ వార్త అయినా ఇట్టే వైరల్ అయిపోతూ ఉంటుంది. ఇక వీళ్ళ పర్సనల్ లైఫ్ గురించి కనుక ఏదైనా వార్త వస్తే అది ట్రెండింగ్లో నిలుస్తుంది అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు.’జబర్దస్త్’ స్టార్ కమెడియన్ చమ్మక్ చంద్ర అందరికీ సుపరిచితమే. ఇతని స్కిట్స్ కు ప్రత్యేకమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.

ముఖ్యంగా ఫ్యామిలీ ఆడియన్స్ (Chammak Chandra) చమ్మక్ చంద్ర స్కిట్స్ ను ఇష్టపడతారు. అయితే ఇతను జబర్దస్త్ కి రాకముందు వంట మనిషిగా పనిచేసేవాడట. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అతనే చెప్పుకొచ్చాడు. అతను మాట్లాడుతూ.. “నాకు చిన్నప్పుడు చదువు పై ఇంట్రెస్ట్ ఉండేది కాదు. నటన పైనే ఇంట్రెస్ట్ ఉండేది. నేను పెళ్లి వేడుకలకు హాజరైతే అక్కడ డాన్స్ చేసే వాడిని.

నాకు డాన్స్ కొద్దో గొప్పో బాగానే వచ్చు. అందుకే ఆ తర్వాత డాన్స్ క్లాసులు కూడా నిర్వహించేవాడిని. అలా వచ్చిన డబ్బుతో యాక్టింగ్ కోర్స్ చేశాను. తర్వాత ఆ డబ్బు కూడా సరిపోయేది కాదు. అందుకోసం నేను విజయ్ అనే నటుడి ఇంట్లో వంట మనిషిగా పనిచేశాను” అంటూ చమ్మక్ చంద్ర చెప్పుకొచ్చాడు. అతని కామెంట్స్ ఇప్పుడు వైరల్ గా మారాయి.

ప్రేక్షకులను థియేటర్ కు రప్పించిన సినిమాలు ఇవే..!
ప్రభాస్, పవన్ కళ్యాణ్ లతో పాటు అభిమానుల చివరి కోరికలు తీర్చిన స్టార్ హీరోలు!

టాలెంట్ కు లింగబేధం లేదు..మహిళా డైరక్టర్లు వీళ్లేనా?
పిల్లలను కనడానికి వయస్సు అడ్డుకాదంటున్న సినీతారలు

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus