ఈ 18 మంది ‘జబర్దస్త్’ కమెడియన్స్ ఏం చదువుకున్నారో తెలుసా?

‘జబర్దస్త్’ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఓ విధంగా ఆ షోలో ఉన్న వాళ్ళంతా ఇప్పుడు చాల వరకు స్టార్స్ లానే వెలుగొందుతున్నారు. వాళ్లకు బయటగానీ, సోషల్ మీడియాలో గానీ ఉన్న క్రేజ్ అంతా ఇంతా కాదు. వీళ్ళు వరుస సినీ అవకాశాలను కూడా దక్కించుకుంటున్నారు.గెటప్ శీను, ఆటో రామ్ ప్రసాద్, హైపర్ ఆది, సుడిగాలి సుధీర్.. ఇంకా చాలా మంది బుల్లితెర పై రాజ్యమేలుతున్నారు. మొన్నటికి మొన్న ఓ షోలో హైపర్ ఆది ఏకంగా 16 ఎకరాల పొలం కొన్నాను అంటూ చేసిన కామెంట్ న బట్టి వీళ్ళ సంపాదన ఏ రేంజ్లో ఉంటుందో అర్ధం చేసుకోవచ్చు. సంపాదన మాత్రమే కాదు వీళ్ళలో చాలా మంది మంచి చదువులు చదువుకున్నారు కూడా. వాళ్ళెవరో ఓ లుక్కేద్దాం రండి :

1) హైపర్ ఆది:

‘జబర్దస్త్’ కు ఇతనో సూపర్ స్టార్ లాంటివాడు. యూట్యూబ్ లో ఇతని స్కిట్స్ కు మిలియన్ల కొద్దీ వ్యూస్ నమోదవుతూ ఉంటాయి. ఇతను బి.టెక్ చదువుకున్నాడని చాలా సందర్భాల్లో చెప్పుకొచ్చాడు.

2) అదిరే అభి :

మొదట్లో పలు సినిమాల్లో నటించినా రాని గుర్తింపు.. ఇతనికి జబర్దస్త్ ద్వారా వచ్చింది. ఓ సాఫ్ట్ వేర్ గా వర్క్ చేస్తూనే జబర్దస్త్ లో స్కిట్స్ చేసేవాడు.ఇతను బి.టెక్ చదువుకున్నాడన్న సంగతి బహుశా ఎక్కువమందికి తెలిసుండదు.

3) ఇమ్మాన్యుయేల్:

ఇప్పుడిప్పుడే ఫేమస్ అవుతున్న ఇమ్మాన్యుయేల్ డిగ్రీ చదువుకున్నాడు.

4)మహేష్ ఆచంట :

‘జబర్దస్త్’ ద్వారా పాపులర్ అయిన మహేష్ ప్రస్తుతం సినిమాల్లో బిజీగా గడుపుతున్నాడు. ఇతను డిగ్రీ చేసాడు.

5) ముక్కు అవినాష్ :

రైజింగ్ స్టార్ కమెడియన్..అలాగే బిగ్ బాస్ కంటెస్టెంట్ అయిన అవినాష్ ఎం.బి.ఎ చేసాడు.

6) రష్మీ :

‘జబర్దస్త్’ యాంకర్ రష్మీ ఆంధ్రా యూనివర్సిటీలో గ్రాడ్యువేషన్ చేసింది.

7)అనసూయ :

‘జబర్దస్త్’ కు గ్లామర్ ను తెచ్చిన అనసూయ.. ఎం.బి.ఎ చేసింది.

8)బుల్లెట్ భాస్కర్ :

మహేష్ బాబుని తెగ ఇమిటేట్ చేస్తుంటాడన్న సంగతి తెలిసిందే. ఇతను బి.కామ్ చదువుకున్నాడు.

9)తాగుబోతు రమేష్ :

సినిమాల్లో బాగా పాపులర్ అయిన తర్వాత జబర్దస్త్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చాడు రమేష్. ఇతను కూడా డిగ్రీ చదువుకున్నాడు.

10) సునామీ సుధాకర్ :

పాత సినిమా హీరోలను తెగ ఇమిటేట్ చేస్తుంటాడు సుధాకర్. ఇతను కూడా డిగ్రీ చదువుకున్నాడు.

11)చమ్మక్ చంద్ర :

ఫ్యామిలీ ఆడియెన్స్ ను మెప్పించే స్కిట్లు చేసే చమ్మక్ చంద్ర ఇంటర్మీడియేట్ మాత్రమే కంప్లీట్ చేసాడు.

12)చలాకీ చంటి :

డిగ్రీ మధ్యలో ఆపేసి ఇండస్ట్రీకి వచ్చేసాడు.

13)రామ్ ప్రసాద్ :

ఇంటర్మీడియేట్ ఫస్ట్ ఇయర్ తో ఆపేసాడు.

14)గెటప్ శ్రీను :

ఇతను కూడా ఇంటర్మీడియేట్ మధ్యలో ఆపేసాడు

15)కెవ్వు కార్తీక్ :

ఇతను డిగ్రీతో ఆపేసాడు

16) అదుర్స్ ఆనంద్ :

డిగ్రీ పూర్తి చేసాడు. తర్వాత ఎం.సి.ఎ లో కూడా జాయిన్ అయ్యాడు. కానీ కొన్ని కారణాల వలన ఆపేసాడు.

17) రాకెట్ రాఘవ :

ఇతను కూడా డిగ్రీ పూర్తిచేసాడు

18) సుడిగాలి సుధీర్ :

‘జబర్దస్త్’ లో స్టార్ గా ఎదిగిన సుధీర్ కూడా ఇంటర్మీడియేట్ మధ్యలో ఆపేసాడు

Read Today's Latest Focus Update. Get Filmy News LIVE Updates on FilmyFocus