బిగ్‌బాస్‌: ఈ రోజు అందరూ ఇంట్లోకి వెళ్లారా?

‘బిగ్‌బాస్‌’.. ఏదైనా జరగొచ్చు అనేది ఫేమస్‌ ట్యాగ్‌లైన్‌. ఈ సీజన్‌కి కూడా ఇది కొనసాగుతున్నట్లు ఉంది. అంతా ఓకే అయిపోయింది.. షో మొదలుపెట్టడమే అనుకుంటున్న తరుణంలో ఓ షాక్‌. ఈసారి షోలో కీలకంగా ఉంటాడు అనుకున్న ఓ నవ్వుల నటుడికి కరోనా సోకిందట. దీంతో బిగ్‌బాస్‌ బృందం ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. ఇంతకీ ఎవరా నటుడు అనేగా మీ ప్రశ్న. ఇంకెవరు జబర్దస్త్‌తో పాపులర్‌ అయిన అవినాష్‌… ముక్క అవినాష్‌.

బిగ్‌బాస్‌ ప్రారంభానికి చాలా రోజుల నుంచే పార్టిసిపెంట్లను క్వారంటైన్‌లో ఉంచారు. కరోనా పరీక్షలు చేసి, రూఢీ చేసుకున్నాకే క్వారంటైన్‌లో పెట్టారు. అయితే క్వారంటైన్‌ పూర్తయి షో ప్రారంభానికి ముందు అవినాష్‌కి కరోనా సోకినట్లు నిర్ధారణ అయ్యిందట. దీంతో అవినాష్‌ను షోలోకి ప్రస్తుతం తీసుకోవడం లేదు. అయితే పూర్తిగా షో నుంచి అతడిని పంపించేయడం లేదని తెలుస్తోంది. కొన్ని రోజుల తర్వాత అవినాష్‌ లేట్‌ ఎంట్రీగా పంపిస్తారని భోగట్టా.

ప్రస్తుతం ముక్కు అవినాష్‌ క్వారంటైన్‌లో ఉన్నాడని బిగ్‌బాస్‌ వర్గాల భోగట్టా. దీంతో 14 రోజుల క్వారంటైన్‌ తర్వాత ఏ మూడో వారంలో పంపిస్తారని అంటున్నారు. అదే జరిగితే ఈ రోజు ముందుగా అనుకున్నట్లు ఈ రోజు 16 మంది పార్టిసిపెంట్లు ఇంట్లోకి వెళ్లరు. ఒకరు తక్కువగానే వెళ్తారన్నమాట. లేకపోతే మొత్తం 16 మందినీ పంపి.. ఒకరిని ఇమ్మీడియట్‌ ఎలిమినేషన్‌ చేస్తారేమో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus