గత కొన్ని రోజులుగా ‘జబర్దస్త్’ షోలో స్కిట్ లు చేస్తూ కనిపిస్తోంది వర్ష. గతంలో ఈమె కొన్ని సీరియల్స్ లో నటించినప్పటికీ.. ‘జబర్దస్త్’ షోతోనే కాస్త పాపులారిటీ దక్కించుకుంది. చూడడానికి అందంగా, నాజూకుగా ఉండడంతో నిత్యం వార్తల్లో నిలుస్తోంది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా ఈ బ్యూటీకి సంబంధించిన ఓ పాత వీడియోని నెటిజన్లు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఈ వీడియోలో వర్ష.. అనసూయపై షాకింగ్ కామెంట్స్ చేస్తూ రెచ్చిపోవడంతో జనాల్లో హాట్ టాపిక్ అయింది.
దీంతో వర్ష వివరణ ఇవ్వక తప్పలేదు. కొద్దిరోజుల క్రితం ఓ బాలుడు అనసూయ దగ్గరకి వచ్చి సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేయగా.. ఆమె సెల్ ఫోన్ తీసుకొని నేలకేసి కొట్టింది. ఈ ఇష్యూపై అప్పట్లో అనసూయని తెగ ట్రోల్ చేశారు. కమెడియన్ వర్ష కూడా అప్పట్లో ఓ వీడియో ద్వారా అనసూయపై మండిపడింది. అభిమానుల వలనే ఈ స్థాయిలో ఉన్నావని గుర్తుపెట్టుకో అంటూ క్లాస్ పీకింది. ఈ వీడియోను నెటిజన్లు ఇప్పుడు వైరల్ చేయడంతో..
వర్ష లైవ్ లోకి వచ్చి ఈ విషయంపై మాట్లాడింది. అనసూయ గురించి పూర్తిగా తెలియక అలా మాట్లాడానని, ఆ తరువాత అనసూయని కలిసి క్షమాపణలు కోరినట్లు చెప్పింది. అనసూయ కూడా చాలా కూల్ గా రిసీవ్ చేసుకున్నారని.. తెలియక మాట్లాడానని అర్ధం చేసుకున్నారని వెల్లడించింది. ఇప్పటికీ ఆ విషయంలో బాధ పడతానని.. అనసూయ వ్యక్తిగతంగా చాలా మంచిది అంటూ చెప్పుకొచ్చింది.
ఆకాశం నీ హద్దు రా సినిమా రివ్యూ & రేటింగ్!
‘బిగ్ బాస్ 4’ లో ఎవరి పారితోషికం ఎంత.. ఎక్కువ ఎవరికి..?
50 కి దగ్గరవుతున్నా.. పెళ్లి గురించి పట్టించుకోని హీరొయిన్ల లిస్ట్..!