సీక్రెట్ గా పెళ్లి చేసుకొన్న శీకాకుళం కమెడియన్!
- April 23, 2016 / 11:35 AM ISTByFilmy Focus
“జబర్దస్త్” షో పుణ్యమా అని చిత్ర పరిశ్రమకు దొరికిన మరో ఆణిముత్యం షకలక శంకర్. శ్రీకాకుళం యాసతో రాంగోపాల్ వర్మను ఇమిటేట్ చేస్తూ శంకర్ చేసే కామెడీకి కడుపు చెక్కలయ్యేలా నవ్వని వారుండరంటే అతిశయోక్తి కాదు.
ఇటీవల సినిమాల్లోకి వచ్చిన షంకర్.. ఇక్కడ కూడా అదే స్లాంగ్ సహాయంతో కామెడీ కింగ్ గా ఎదుగుతున్నాడు. ఇప్పుడిప్పుడే ఫైనాన్షియల్ గా నిలదుక్కొకుంటున్న శంకర్ నిన్న మధ్యాహ్నం పెళ్లి చేసుకొన్నాడట. పెద్దలు కుదిర్చిన సంబంధం అది. అమ్మాయి పేరు పార్వతి. ఎటువంటి ఆడంబరాలకు పోకుండా.. కేవలం తనకు అత్యంత సన్నిహితులు మరియు ఆప్తులు అయిన వారి మధ్య చాలా సింపుల్ గా పెళ్లి తంతు కానిచ్చేసాడు. పెళ్లికయ్యే ఖర్చును పేద విద్యార్ధులకు పుస్తకాలు, క్రికెట్ కిట్ లు కొనివ్వడానికి ఉపయోగించనున్నానని శంకర్ పేర్కొనడం విశేషం!
Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus











