మంచి సంబంధం తీసుకురండి పెళ్ళిచేసుకుంటాను : జబర్దస్త్ బ్యూటీ

బుల్లితెర ‘జబర్దస్త్’ కామెడీ షో కి సంబందించిన యాంకర్‌, నటీనటులకు సంబంధించి ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటుంది. వాటి పై సోషల్ మీడియాలో కూడా తెగ డిస్కషన్లు అవుతుంటాయి. ఇటీవల కమెడియన్ సాయితేజ అలియాస్… పింకీ సీక్రెట్ గా పెళ్ళిచేసుకుందంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అలాంటిదేమీ లేదు అని క్లారిటీ ఇచ్చినా ఆ వార్తలు ఆగలేదు. దీంతో స్వయంగా ఆమెనే ‘టిక్ టాక్’ లో ఓ వీడియో ద్వారా డైరెక్ట్ గా క్లారిటీ ఇచ్చింది.

పింకీ మాట్లాడుతూ… ” నేను పెళ్ళి చేసుకున్నాను అంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదు. అయినా నన్ను ఎవరు పెళ్ళిచేసుకుంటారు. మీకు తెలిసి ఎవరైనా అబ్బాయి ఉంటే చెప్పండి కచ్చితంగా పెళ్ళిచేసుకుంటాను. మీకు తెలిసిన సంబంధం ఉంటే తీసుకుని రండి” అంటూ చెప్పుకొచ్చింది. ‘జబర్దస్త్‌’ లో ఎన్నో స్కిట్స్ లో లేడీ గెటప్స్ వేసి అలరించిన సాయితేజ(పింకీ).. ఆ తరువాత జెండర్ ట్రాన్స్‌ప్లాంటేషన్ సర్జరీ ద్వారా అమ్మాయిగా మారిపోయాడు. అప్పటినుండీ తన పేరుని కూడా ప్రియాంక సింగ్‌ అలియాస్ పింకీ గా మార్చుకున్నాడు. అనారోగ్యం కారణంగా జబర్దస్త్ కు దూరంగా ఉంటూ వస్తున్న పింకీ.. ‘టిక్ టాక్‌’ మాత్రం వీడియోలు చేస్తూ జనాల్ని ఎంటర్టైన్ చేస్తుంది.


17 ఏళ్ళ కెరీర్లో ప్రభాస్ రిజెక్ట్ చేసిన సినిమాలేంటో తెలుసా..?
వయసుకు మించిన పాత్రలు చేసి మెప్పించిన టాలీవుడ్ హీరోలు..!
తిప్పరామీసం సినిమా రివ్యూ & రేటింగ్!
ఏడు చేపల కథ సినిమా రివ్యూ & రేటింగ్!

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus