‘జబర్దస్త్’ సాయి తేజ గురించి షాకింగ్ నిజాలు…!

‘జబర్దస్త్’ ఈ కామెడీ షో ఎంతో మందికి లైఫ్ ఇచ్చింది. సినిమాల్లో అవకాశాలు కూడా దక్కేలా చేసి మరింతగా వారిని పాపులర్ చేసింది. సినిమాలే లైఫ్ అంటూ వచ్చి కృష్ణానగర్ లో ఉంటూ.. అవకాశాలు కోసం స్టూడియోల చుట్టూ తిరుగుతున్న ఎంతో మందికి ఇలాంటి కామెడీ షో దారి చూపించింది. ఈ షో ఇన్స్పిరేషన్ తో ఇప్పుడు మరిన్ని షో లు ప్రారంభమయ్యాయి.

ఇదిలా ఉంటే… ‘జబర్దస్త్’ షో లో లేడీ గెటప్ లు వేస్తూ హల్ చల్ చేసిన సాయి తేజ అందరికీ గుర్తుండే ఉంటాడు. తరువాత పూర్తిగా అమ్మాయిలా మారిపోయి ప్రియాంకా సింగ్ గా పేరు మార్చుకున్నాడు. మొన్నటికి మొన్న ఈమె పెళ్ళి చేసుకుంది అనే వార్తలు కూడా వచ్చాయి. అయితే అవన్నీ ఫేక్ అని ప్రియాంకా సింగ్ తేల్చేసింది. ఈమె అమ్మాయిగా మారాలి అని డిసైడ్ అయినప్పుడు తన తల్లిదండ్రులకు చెప్పలేదట.

వారికి తెలిస్తే ఒప్పుకోరు అని. చిన్నప్పటి నుండే ఈమెకు అమ్మాయిలా ఉండాలనే కోరిక ఉండేదట. ఎవ్వరికీ తెలీకుండా తన అక్క బట్టలు వేసుకుని.. అద్దం ముందు చూసుకునే దాన్ని అని ఈమె తెలిపింది. ఇక ఈమె అమ్మాయిలా మారడానికి లక్షలు ఖర్చు పెట్టిందట. అయితే అంతా తన కష్టార్జితమే అని తెలిపింది. ప్రస్తుతం ‘అదిరింది’ షో లో చేస్తుందట. సినిమాల్లో నటించడానికి ముఖ్యంగా ఎక్స్పోజింగ్ చెయ్యడానికి కూడా నేను రెడీ అని చెబుతుంది ప్రియాంకా సింగ్.

1

2

3

4

Most Recommended Video

టాలీవుడ్ టాప్ హీరోల వరస్ట్ లుక్స్ ఇవే!
17 ఏళ్లలో అల్లు అర్జున్ రిజెక్ట్ చేసిన సినిమాలు ఇవే!
బుల్లితెర పై రికార్డులు క్రియేట్ చేసిన సినిమాలు ఇవే!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus