జోక్‌లేసిన వారి దిమ్మతిరిగే గెటప్‌ వేసిన వర్ష!

  • June 15, 2022 / 01:18 PM IST

‘జబర్దస్త్‌’లో యాంకర్లు అనసూయ, రష్మి కాకుండా గ్లామర్‌ అంటే వర్ష అని చెప్పాలి. షోలో కాస్త గ్లామర్‌ విషయంలో కంట్రోల్‌గా ఉన్నా.. సోషల్‌ మీడియాలో మాత్రం ఒక్కోసారి హద్దుల్ని హద్దులు దాటించేస్తుంటుంది. హాట్‌ అందాలతో రెచ్చిపోతూ ఉంటుంది. అయితే ఆమె జీర గొంతును ఆధారంగా చేసుకొని స్కిట్లలో ఆమెను మగాడు అని అంటుంటారు తోటి కమెడియన్లు. వాటిని ఎంతో స్పోర్టివ్‌గా తీసుకొని తన అందం, పంచ్‌లతో రాణిస్తోంది. కొందరు అంటున్నట్లు వర్ష నిజంగా మగాడిలా ఉంటే ఎలా ఉంటుంది?

అనే ప్రశ్న మీ మైండ్‌లో ఎప్పుడైనా తట్టిందా? మీ మనసులో ఉందో లేదో తెలియదు కానీ.. అలాంటి ప్రయత్నం చేసింది వర్ష. మగాడి గెటప్‌ వేసుకొని వచ్చే వారం ఎక్స్‌ట్రా జబర్దస్త్‌లో ఓ ఎపిసోడ్‌లో చేసింది. ఆటో రామ్‌ప్రసాద్ టీమ్‌లో వర్ష మేల్‌ గెటప్‌లో కనిపించింది. ఒక్క క్షణం పాటు ఆ మనిషి వర్షయేనా అనే డౌట్‌ వచ్చేంతగా ఆ గెటప్‌తో మారిపోయింది. ఇంకా చెప్పాలంటే ‘ఎఫ్‌ 3’లో తమన్నా మేల్‌ గెటప్‌ వేస్తే ఎలా ఉంటుందో..

ఇక్కడ వర్ష అలా ఉంది అని చెప్పొచ్చు. స్కిట్‌ కోసం వర్షకి రాంప్రసాద్‌ హాస్టల్‌ వార్డెన్‌ పాత్ర ఇచ్చినట్లున్నాడు. తన హాస్ట్‌లో ఉన్నవారిని ఎవరైనా ఏమన్నా అంటే తాట తీసేసే పాత్ర అది. వర్ష ఈ పాత్రను బాగానే చేసినట్లు కనిపిస్తోంది. మ్యాన్లీ లుక్‌, ఫిజిక్‌ లేకపోయినా… ఫేస్‌ మాత్రం అచ్చంగా అబ్బాయిలానే ఉంది అని చెప్పొచ్చు. రాంప్రసాద్‌ చీరకట్టుకుని వచ్చాక.. వర్ష అతనితో చేసే చిలిపి సరదాలు కూడా చూడటానికి బాగున్నాయి.

మరోవైపు రాంప్రసాద్‌ వేసే ఆటో పంచ్‌లకు బాబుతో కలసి వర్ష పండించిన కామెడీ కూడా బాగుంది. మరి ఫుల్‌ ఎపిసోడ్‌లో ఈ పాత్ర ఎంతమేరకు ఉంటుంది, ఎంతమేర నవ్విస్తుంది అని చూడాలి. ఒకవేళ ఈ పాత్ర క్లిక్‌ అయితే తర్వాత చాలా స్కిట్లలో వర్షను ఇలానే చూపించే అవకాశం ఉంది. వీలైతే శ్రీదేవి డ్రామా కంపెనీలో ఇదే పాత్రతో ఓ ఎపిసోడ్‌ కూడా నడిపించేస్తారు.

అంటే సుందరానికీ సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

అభిమాని టు ఆలుమగలు…అయిన 10 మంది సెలబ్రిటీల లిస్ట్..!
‘జల్సా’ టు ‘సర్కారు వారి పాట’.. బ్యాడ్ టాక్ తో హిట్ అయిన 15 పెద్ద సినిమాలు ఇవే..!
చిరు టు మహేష్..సినిమా ప్రమోషన్లో స్టేజ్ పై డాన్స్ చేసిన స్టార్ హీరోల లిస్ట్..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus