Jack Collections: నిరాశపరిచిన ‘జాక్’ ఓపెనింగ్స్!

‘డిజె టిల్లు’ ‘టిల్లు స్క్వేర్’ తర్వాత సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda) నుండి వచ్చిన సినిమా ‘జాక్’ (Jack). బొమ్మరిల్లు భాస్కర్ ఈ సినిమాకు దర్శకుడు. ‘బేబీ’ తో టాప్ ప్లేస్ కి చేరుకున్న వైష్ణవి చైతన్య (Vaishnavi Chaitanya) ఇందులో హీరోయిన్. ‘శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర'(SVCC) బ్యానర్ అధినేతలు బీవీఎస్ఎన్ ప్రసాద్, బాపినీడు ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 10న అంటే నిన్న ప్రేక్షకుల ముందుకు వచ్చింది ఈ సినిమా.

Jack Collections

మొదటి షోతోనే సినిమాకి నెగిటివ్ టాక్ వచ్చింది. దీంతో ఓపెనింగ్స్ కూడా ఆశించిన స్థాయిలో నమోదు కాలేదు. ఒకసారి ఫస్ట్ డే కలెక్షన్స్ ను గమనిస్తే :

నైజాం 0.42 cr
సీడెడ్ 0.13 cr
ఉత్తరాంధ్ర 0.20 cr
ఈస్ట్ 2.03 cr
వెస్ట్ 0.07 cr
గుంటూరు 0.10 cr
కృష్ణా 0.10 cr
నెల్లూరు 0.05 cr
ఏపీ + తెలంగాణ (టోటల్) 1.16 cr
రెస్ట్ ఆఫ్ ఇండియా 0.04 cr
ఓవర్సీస్ 0.11 cr
వరల్డ్ వైడ్ (టోటల్ ) 1.31 కోట్లు(షేర్)

‘జాక్’ సినిమాకు రూ.14.9 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ కోసం రూ.15.5 కోట్ల షేర్ ను రాబట్టాలి. మొదటి రోజు ఈ సినిమా రూ.1.31 కోట్ల షేర్ ను రాబట్టింది. గ్రాస్ పరంగా రూ.2.06 కోట్లు కలెక్ట్ చేసింది. అయితే బ్రేక్ ఈవెన్ కి మరో రూ.14.19 కోట్ల షేర్ ను రాబట్టాలి.

‘జాక్’ నెగిటివ్ టాక్.. వైష్ణవినే అనడం ఎంతవరకు కరెక్ట్..!

 

Read Today's Latest Collections Update. Get Filmy News LIVE Updates on FilmyFocus