సౌందర్యతో సంబంధం గురించి జగపతిబాబు ఏమన్నారంటే?
- January 9, 2017 / 01:03 PM ISTByFilmy Focus
తెలుగు చిత్రపరిశ్రమలోని గొప్పనటీమణుల్లో సౌందర్య ఒకరు. తన అభినయంతో తెలుగువారి గుండెల్లో సుస్థిర స్థానం సంపాదించుకుంది. సౌందర్య ఇప్పుడు మనమధ్య లేకపోయినా ఆమె గురించి హీరో జగపతిబాబు ఓ విషయం చెప్పారు. వీరిద్దరూ కలిసి దొంగాట, భలే బుల్లోడు, పెళ్లి పీటలు, చిలుక పచ్చ కాపురం సినిమాల్లో నటించారు. అప్పుడు వీరిద్దరి మధ్య సంబంధం ఉందని రూమర్లు గుప్పుమన్నాయి. అందుకు రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూ లో జగ్గూభాయ్ క్లారిటీ ఇచ్చారు. “అవును. నాకు సౌందర్య తో సంబంధం ఉంది. సంబంధం అంటే అర్ధం శారీరక సంబంధం అని కాదు. మేమిద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ కన్నా ఎక్కువ క్లోజ్ గా ఉంటాం. నేను ఆమెను ప్రేమిస్తాను. నేనంటే ఆమెకు ఇష్టం.
సౌందర్యకు మాత్రమే కాదు.. వాళ్ల కుటుంబ సభ్యులకు నేనంటే ఇష్టమే. ప్రతి వేడుకకు నన్ను పిలుస్తారు. నేను వెళ్తుంటాను” అని వివరించారు. ఒక అమ్మాయి అబ్బాయితో క్లోజ్ గా ఉన్నంత మాత్రాన వారిమధ్య శారీరక సంబంధం ఉంది అని అనుకోవడం తప్పని వెల్లడించారు. “ఎవరైనా మా మధ్య అక్రమ సంబంధం ఉందని అనుకున్నా.. పరవాలేదని సంతోషంగా కలిసి తిరిగేవాళ్లం. అందుకే నేను ఎప్పుడూ దాక్కొని వాళ్ళింటికి వెళ్ళలేదు.. డైరక్ట్ గ వెళ్ళాను. ఆలా వెళ్ళాను కాబట్టే నా పైన ఆ రూమర్ వచ్చి ఉంటుంది” అని జగపతి బాబు స్పష్టం చేశారు.
Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.












