‘జగ్గుభాయ్’ టార్గెట్ గా చిరు ప్లాన్!

టాలీవుడ్ లో అందగాడిగా, అందమైన హీరోగా ఫ్యామిలీ ఆడియన్స్ ను ఉర్రూతలూగించిన మోస్ట్ హ్యాండ్‌సమ్ హీరో జగపతిబాబు కొంత గ్యాప్ తరువాత మళ్లీ టాలీవుడ్ లో సెకెండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేశాడు. అయితే ఇండస్ట్రీలోకి రీ ఎంట్రీ ఇచ్చిన వెంటనే వరుస హిట్స్తో దూసుకుపోవడం స్టార్ట్ చేశాడు. లెజెండ్, నాన్నకు ప్రేమతో, శ్రీమంతుడులో జగపతిబాబు యాక్టింగ్ కి ఫిదా అయిపోయింది టాలీవుడ్. ఇక ఆ దెబ్బతో భారీగా పారితోషకం తీసుకునే యాక్టర్స్ లిస్ట్ లో చేరిపోయాడు మన జగ్గు భాయ్. అదే క్రమంలో తాజాగా మెగా స్టార్ తన 150వ సినిమాలో నటీనటుల కోసం విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నాడు కానీ ఏ ఒక్కటి ఫలించడం లేదు. ఇప్పటివరకూ ఆ సినిమాకు హీరోయిన దొరకలేదు అంటే అర్ధం చేసుకోవచ్చు చిరు పరిస్థితి ఏంటో.

ఇక మరో పక్క విలన్ పాత్రకు సైతం చిరు మంచి నటుణ్ణి ఎన్నుకోవాలి అన్న ఆలోచనతో ఉన్నాడు. ఆ ప్లాన్ లో భాగంగానే గతంలో విలన్ గా  నటించేందుకు ఒక బాలీవుడ్ నటుణ్ణి సైతం ఒప్పించారు. ఆయన ఒక  సీనియర్ హీరోయిన్ భర్త కూడా. అంతా ఓకే అనుకున్నాక చివరి నిమిషంలో ఆయన హ్యాండ్ ఇవ్వడంతో మళ్లీ మొదటికి వచ్చింది కధ. ఇక చేసేది ఏమీ లేక…మళ్లీ విలన్ కోసం వేట మొదలు పెట్టిన మెగా ఫ్యామిలీ కన్ను జగ్గు భాయ్ పై పడింది. చిరంజీవికి కాని వినాయక్ కి కాని జగపతిబాబుని మించిన నటుడు కోలీవుడ్ , బాలీవుడ్ లలో దొరకడం కష్టంగా ఉండడంతో చివరకు వాళ్ళు జగ్గు భాయ్ నే  ఒప్పించాలి అని ప్రయత్నాలు మొదలు పెట్టారు. అయితే ఇంతవరకు బాగానే ఉంది కానీ ఇక్కడ చిక్కు ఏంటి అంటే…చుక్కలు తాకుతున్న జగ్గు భాయ్ భారీ పారితోషికం గురించి ఆలోచిస్తూ మెగా కాంపౌండ్ ఈవిషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో అన్న అనుమానం సైతం అందరికీ ఉంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus