లైంగిక వేధింపుల కేస్ లో అర్జున్ కి సపోర్ట్ చేసిన జగపతిబాబు
- November 12, 2018 / 07:36 AM ISTByFilmy Focus
ముక్కుసూటిగా మాట్లాడడంలో మన జగ్గూ భాయ్ అలియాస్ జగపతిబాబు ఎప్పుడు ముందుంటాడు. ముఖ్యంగా.. ఎలాంటి ఇష్యూలో అయినా తన దృష్టికోణాన్ని వ్యక్తపరచడానికి అస్సలు మొహమాటపడరు జగపతిబాబు. జగపతిబాబుకి ఇండస్ట్రీలో ఉన్న అత్యంత ఆప్త మిత్రుల్లో హీరో అర్జున్ ఒకడు. ఇద్దరూ కలిసి రెండుమూడు సినిమాల్లో నటించడమే కాక అర్జున్ అంటే జగపతిబాబుకి చాలా ఇష్టం కూడా. అయితే.. ఇటీవల అర్జున్ మీద శ్రుతిహరిహరన్ అనే నటి లైంగిక వేధింపుల దావా వేసింది. ఈ విషయమై టీం అందరూ అర్జున్ నే సపోర్ట్ చేస్తున్నప్పటికీ.. శ్రుతికి కూడా తక్కువ సపోర్ట్ ఏమీ లేదు.
ఈ విషయమై స్పందించిన జగపతిబాబు.. అర్జున్ గురించి నాకు బాగా తెలుసు. అయినా ఒక 150 మంది క్రూ మెంబర్స్ ముందు అలా బిహేవ్ చేయడానికి ఎవరు ధైర్యం చేస్తారు. ఆ అమ్మాయి మిస్ అండర్ స్టాండ్ అయినా చేసుకొని ఉండాలి లేదా పర్సనల్ ఇష్యూస్ అయినా ఉండి ఉండాలి అని తన స్నేహితుడు అర్జున్ కి వత్తాసు పలికాడు జగపతిబాబు. ఈ ఇన్సిడెంట్ తో జగపతిబాబు తన స్నేహితులకు, తన అనుకున్న మనుషులకు ఎంత వేల్యూ ఇస్తాడు అనేది అందరికీ స్పష్టమైంది.
















