జగపతి బాబు ఎందుకు కాదన్నాడు??

సినీ పరిశ్రమలో అందాల నటుడు జగపతి బాబు, తన సెకెండ్ ఇన్నింగ్స్ ను సక్సెస్‌ఫుల్ గా సాగిస్తున్నాడు. ఒక విలన్ గా, హీరో తండ్రిగా, స్టైలిష్ నెగేటివే షేడ్స్ ఉన్న పాత్రలో అందరినీ కవ్విస్తున్నాడు జగపతి. ఇదిలా ఉంటే ఈ హీరో కమ్ విలన్ ఈ మధ్య ఫేస్‌బుక్ వేదికగా ఒక సంచలన ప్రకటన చేశాడు. ఇంతకీ ఎంటా సంచలన ప్రకటన? అంటే…అందాల భామ గౌతమి గుర్తుంది కదా, ఆమె అప్పట్లో క్యాన్సర్ బారిన పడి దాన్ని జయించి, ఇప్పుడు హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తుంది.

అయితే తాను పడిన భాద ఎవ్వరూ పడకూడదు అని ‘లైఫ్ ఎగైన్ ఫౌండేషన్’ అనే స్వచ్చంద సేవా సంస్థను స్థాపించి సేవలు అందిస్తుంది. ఇక ఈ సంస్థకి జగపతి బాబు, మమతామోహన్ దాస్ లు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించేవారు. అదే క్రమంలో ఈ సంస్థను ప్రమోట్ చేసే భాద్యతను కూడా తీసుకున్నారు. అయితే ఏమైందో ఏమో సడన్ గా ఈమధ్య జగపతి బాబు తాను ఈ సంస్థ కార్యకలాపాలలో పాలు పంచుకోలేక పోతున్నందుకు బాధగా ఉంది అంటూ తన ఫేస్ బుక్ లో ఒక మెసేజ్ పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు.  ఇక ఈ వార్త బయటకు రాగానే అందరూ ఒక్కసారిగా గౌతమి, జగపతి మధ్యలో ఏదో తెలియని గొడవ జరిగింది అని అనుకున్నారు.

అసలు ఏం జరిగిందో, సామాన్యంగా వివాదాలకు దూరంగా ఉండే జగపతి బాబు ఇలా ప్రవర్తించడం వెనుక ఏమైనా కారణాలు ఉన్నాయా అన్న అనుమానాలు లేకపోలేదు. ఇక వీటన్నింటి మధ్య మరో ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సంస్థ కార్యకలాపాలు అమెరికాలోని చికాగో నుంచి  కూడ ప్రారంభం అయిన నేపధ్యంలో జగపతి కావాలనే తాను తప్పుకున్నట్లు సమాచారం. ఏది ఏమైనా…ఇప్పుడు జగపతి ఈ సంస్థ నుంచి తప్పుకున్నాడు అన్నది మాత్రం ఒప్పుకోక తప్పని నిజం.

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus