మాస్ హీరోగానే కాకుండా.. వైవిధ్యమైన పాత్రల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నారు నటుడు సూర్య. ఇటీవల ఆయన నటించిన ‘జైభీమ్’ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. టీజే జ్ఞానవేల్ డైరెక్ట్ చేసిన ఈ సినిమాను సూర్య నిర్మించారు. గతేడాది నవంబరులో ఓటీటీలో విడుదలైన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు దక్కాయి.
సినిమా అంటే హీరోయిన్ తో రొమాన్స్, ఐటెం సాంగ్, యాక్షన్ సీన్స్ కాదని.. నిరూపించింది ‘జైభీమ్’. ఐఎండీబీ రేటింగ్స్‌లో ఈ సినిమా టాప్ ప్లేస్ దక్కించుకుంది. 73 వేలకుపైగా ఓట్లతో 9.6 రేటింగ్ సాధించింది. ఇప్పటివరకు ఏ సౌత్ సినిమాకు ఇలాంటి రేటింగ్ రాలేదు. నిజ జీవిత సంఘటన ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
తాజాగా ఈ సినిమాకి అరుదైన గౌరవం దక్కింది. అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ (ఆస్కార్) అధికారిక యూట్యూబ్ ఛానెల్‌లో ‘సీన్ ఎట్ ది అకాడమీ’ పేరుతో ఈ సినిమాలోని ఓ వీడియోను పోస్ట్ చేశారు. ఓ తమిళ సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్ ను ఆస్కార్ ఛానెల్ లో పోస్ట్ చేయడం ఇదే మొదటిసారి.
ఈ విషయంలో ‘జైభీమ్’ చిత్రబృందంతో పాటు అభిమానులు కూడా సంతోషపడుతున్నారు. ఈ సినిమా ఇండియా సినిమా స్థాయిని మరో స్థాయికి తీసుకెళ్లిందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్, లాయర్ ‘జస్టిస్ చంద్రు’ జీవితం ఆధారంగా ఈ సినిమాను తెరకెక్కించారు.
Most Recommended Video
చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!