Jai Hanuman : ‘జై హనుమాన్’ మూవీ షూటింగ్ కి లైన్ క్లియర్.. అతి త్వరలోనే సెట్స్ పైకి !

టాలీవుడ్‌లో సీక్వెల్స్ ట్రెండ్ జోరుగా నడుస్తున్న వేళ, భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న చిత్రం ‘జై హనుమాన్’ . బ్లాక్‌బస్టర్ చిత్రం ‘హనుమాన్’ చిత్రానికి సీక్వెల్‌గా రానున్న ఈ ప్రాజెక్ట్‌పై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. మొదటి భాగంలో హీరోగా తేజ సజ్జ నటించిన సంగతి తెలిసిందే. ఈ సీక్వెల్ కి కూడా దర్శకత్వ బాధ్యతలు ప్రశాంత్ వర్మనే చేపట్టబోతున్నాడు.

Jai Hanuman

ఇటీవల ఈ ప్రాజెక్ట్ ఆగిపోయిందనే వార్తలు వినిపించినా, తాజా సమాచారం ప్రకారం ఫిబ్రవరి 22న హిస్టారికల్ సిటీ అయిన హంపిలో పూజా కార్యక్రమాలతో గ్రాండ్‌గా ప్రారంభం కానుంది. నిర్మాణ బాధ్యతలు మైత్రి మూవీ మేకర్స్ చేపట్టగా, భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా స్థాయిలో రూపొందించనున్నారు. రెగ్యులర్ షూటింగ్ మార్చి నుంచి ప్రారంభం అవుతుందని సినీ వర్గాల సమాచారం.

కాగా, హనుమంతుడి పాత్రలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కనిపించనున్నట్టు ముందే ప్రకటించారు. మొదటి భాగాన్ని మైమరిపించే విజువల్స్, అధునాతన గ్రాఫిక్స్‌తో ఈ చిత్రం ప్రేక్షకులను ఆశ్చర్యపరచబోతుందని టాక్. దర్శకుడు ప్రశాంత్ వర్మ గతంలో విభిన్న కథలతో గుర్తింపు తెచ్చుకున్నారు. ప్రత్యేకమైన కాన్సెప్ట్‌లు, టెక్నికల్ స్టాండర్డ్స్ ఆయన చిత్రాలకు ప్రత్యేకత. ఇప్పుడు ‘జై హనుమాన్’తో మరో విజువల్ వండర్ అందించడానికి సిద్ధమవుతున్నారు.

మొదటి భాగం సాధించిన భారీ విజయాన్ని దృష్టిలో పెట్టుకుని, సీక్వెల్‌ను మరింత గ్రాండ్‌గా మలచాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. మరి బ్లాక్ బస్టర్ చిత్రానికి సీక్వెల్ గా వస్తున్నఈ చిత్రం ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.

Shivani Nagaram : ‘హే భగవాన్’ లో శివాని హీరోయిన్ గా తీసుకోవటానికి కారణం ఏంటంటే..?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus