జై లవకుశ టీజర్ విడుదల తేదీని ప్రకటించిన చిత్ర బృందం

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్రిపాత్రాభినయం చేస్తున్న జై లవ కుశ సినిమా షూటింగ్ వేగంగా జరుగుతోంది.  హైదరాబాద్ శివార్లలో ఉన్న ఓ క్వారీలో యాక్షన్ సన్నివేశాల్ని షూట్ చేస్తున్నారు. విలన్ పాత్రధారి రోనిత్ రాయ్, ఎన్టీఆర్ కాంబినేషన్ సీన్స్ ని బాబీ తెరకెక్కిస్తున్నారు. ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో వందకోట్ల బడ్జెట్ తో కల్యాణ రామ్ నిర్మిస్తున్న ఈ మూవీ ఫస్ట్ లుక్ గతనెల 19 రిలీజ్ అయి సంచలనం సృష్టించింది. టీజర్ కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఆ టీజర్ రిలీజ్ డేట్ ని ఈరోజు చిత్ర బృందం ప్రకటించింది.

జులై 6 సాయంత్రం 5 గంటల 22  నిముషాలకు టీజర్ రిలీజ్ చేయనున్నట్లు ట్విట్టర్లో వెల్లడించింది. ఢిల్లీ భామ రాశీ ఖన్నా, నివేత థామస్, నందితరాజ్ లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ మూవీ సెప్టెంబర్ 21 న థియేటర్లలో రానుంది.  రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలున్నాయి.


Also, do SUBSCRIBE to our YouTube channel to get latest Tollywood updates.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus