Jailer 2 Trailer Review: ‘సర్దార్ 2’ను తలపిస్తున్న ‘జైలర్ 2’ ట్రైలర్.. కానీ ఆ కేమియో ఏ స్టార్‌ది?
- October 5, 2026 / 07:14 PM ISTByPhani Kumar
సూపర్ స్టార్ రజినీకాంత్, దర్శకుడు నెల్సన్ కలయికలో వచ్చిన ‘జైలర్’ సినిమా సూపర్ హిట్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద ఆ సినిమా ఆల్మోస్ట్ రూ.500 కోట్లకి పైగా వసూళ్ళు రాబట్టి బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఆ సినిమాకి సీక్వెల్ గా ‘జైలర్ 2′(Jailer 2) కూడా రూపొందిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 15న ఆ సినిమా రిలీజ్ కానుంది. అయితే సూపర్ హిట్ సినిమాకి సీక్వెల్ రూపొందితే.. దానికి హైప్ ఏ రేంజ్లో ఉండాలి. కానీ ‘జైలర్ 2’ కి సంబంధించి ఇప్పటివరకు విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ ఏదీ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేదు. తాజాగా ట్రైలర్ వదిలారు.
Jailer 2

‘జైలర్ 2’ ట్రైలర్ విషయానికి వస్తే.. ఇది 2 నిమిషాల 24 సెకన్ల నిడివి కలిగి ఉంది. ఫస్ట్ పార్ట్..లో విలన్ వర్మ చనిపోతాడు. అతను చనిపోయే ముందు తనని మించి వాళ్ళు ఉన్నారని చెబుతాడు. ఇక ముత్తువేల్ పాండియన్ (రజనీకాంత్) వారి కోసం బహిరంగంగానే గాలిస్తున్నట్టు చూపించారు. ఇక ఈ సెకండ్ పార్ట్ లో విలన్/సిండికేట్ పేరు కల్పాక్స్ అని తెలుస్తోంది. ‘కల్పాక్స్ గురించి తెలుసుగా, ఎవ్వరినీ బతకనివ్వడు’ అనే డైలాగ్ ను బట్టి ఆ విషయాన్ని అర్దం చేసుకోవచ్చు.

‘ఈ కాలపు స్టైల్ శత్రువులందరినీ ఒకే చోటకి పిలిపించి అక్కడే బాంబు పెట్టటం’ అంటూ రజినీ పలికిన డైలాగ్ బాగుంది. ఎస్ జె సూర్య కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర పోషిస్తున్నాడు. అతని పాత్ర గురించి పెద్దగా క్లూ ఇవ్వలేదు. పైగా అతన్ని చూస్తే ఇటీవల వచ్చిన ‘సర్దార్ 2’ గుర్తుకొస్తుంది. ఇక విద్యాబాలన్, మోహన్ లాల్, శివరాజ్ కుమార్, జాకీ ష్రాఫ్ వంటి స్టార్స్ కూడా ట్రైలర్లో కనిపించారు. ఓ సర్ప్రైజింగ్ కేమియో కూడా ఉందని ట్రైలర్ ద్వారా హింట్ ఇచ్చారు.
ఆ కేమియో చేసింది ఎవరు అన్నది ప్రస్తుతానికి సస్పెన్స్. ఇక మొత్తంగా చూసుకుంటే.. ‘జైలర్ 2’ లో చెప్పుకోదగ్గ వావ్ ఫేక్టర్స్ ఏమీ లేవు. సంగీత దర్శకుడు అనిరుథ్ బీజీఎం సైతం నిరాశపరిచింది. మీరైతే ట్రైలర్ ను ఓ లుక్కేయండి :















