సూపర్ స్టార్ రజనీకాంత్ హవా ముగిసిపోయింది. ఆయన నుండి భారీ విజయాలు దక్కడం ఇప్పుడు అసాధ్యం అని అక్కడా, ఇక్కడా చెణుకులు వినిపిస్తున్న తరుణంలో ఓ ఫ్లాప్‌ను అప్పుడే మూట గట్టుకున్న దర్శకుడితో ‘జైలర్’ అనే సినిమా చేసి రూ. 600 కోట్ల విజయాన్ని అందుకున్నారు కోలీవుడ్‌కి అందించారు. అదీ సూపర్ స్టార్ స్టామినా. అయితే ఇప్పుడు ఈ చర్చ ఎందుకు అంటే ఆయన మరోసారి ‘జైలర్’ అవతారం ఎత్తబోతున్నారట.
అవును, కోడంబాక్కం వర్గాల్లో గత రెండు మూడు రోజులుగా దీని గురించే చర్చ జరుగుతోంది. 2023లో ఘన విజయాన్ని సొంతం చేసుకున్న ‘జైలర్’కు రెండో పార్టు కోసం ఓ పాయింట్‌ను నెల్సన్ దిలీప్ కుమార్ సిద్ధం చేశారనేది ఆ చర్చ సారాంశం. ప్రస్తుతం ఆ సినిమా స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో సిద్ధం చేసే పనిలో ఉన్నారని ఈ క్రమంలో ఇదొక ఫ్రాంచైజీగా మారనుందనేది తమిళ సినీవర్గాల మాట. సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మిస్తారట.
ఈ ఆలోచన ‘జైలర్’ సినిమా సెట్స్ మీద ఉన్నప్పుడే దర్శకుడు నెల్సన్‌కు వచ్చిందట. ఈ క్రమంలోనే ‘జైలర్’ తర్వాత ఆయన ఏ సినిమా కూడా కమిట్ అవ్వలేదు. నిర్మాణ సంస్థ సన్ పిక్చర్స్ సీక్వెల్ చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలిసింది. అయితే ప్రస్తుతం రజనీ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. ‘లాల్ సలామ్’లో కీలక పాత్ర పోషించగా, ‘వేట్టయాన్’ సెట్స్ మీద ఉంది. మరోవైపు లోకేష్ కనకరాజ్ చిత్రంలో నటించాల్సి ఉంది.
కాబట్టి ఈ సినిమాలు అయ్యాకనే ‘జైలర్ 2’ (Jailer) ఉంటుంది అని చెబుతున్నారు. అయితే అప్పటివరకు నెల్సన్ దిలీప్ కుమార్ వేరే సినిమా చేయకుండా ఆగుతారా? లేక చిన్న సినిమా ఏదైనా చేస్తారా అనేది చూడాలి. అయితే యోగిబాబు ప్రధాన పాత్రలో నెల్సన్ ఓ వినోదాత్మక సినిమా చేస్తారని ఆ మధ్య వార్తలొచ్చాయి. అదేమైనా పట్టాలెక్కుతుందేమో చూడాలి. ఒకవేళ లేదంటే రజనీ ఫ్రీ అయ్యేంతవరకు ఆగాల్సిందే.
‘గుంటూరు కారం’ లో ఆకట్టుకునే డైలాగులు ఇవే.!
‘గుంటూరు కారం’ తో పాటు సంక్రాంతి సీజన్ వల్ల సేఫ్ అయిన 10 సినిమాల లిస్ట్.!
2023లో అభినయంతో ఆకట్టుకున్న అందాల భామలు.!