Filmy Focus
Filmy Focus
  • Home Icon
  • సినిమా వార్తలు
  • మూవీ రివ్యూస్
  • కలెక్షన్స్
  • ఫోకస్
  • OTT
  • ఇంటర్వ్యూలు
  • ఫోటోలు
  • వీడియోస్
  • బిగ్ బాస్
  • हिंदी
  • English
  • தமிழ்
  • Home
  • సినిమా న్యూస్
  • సినిమా రివ్యూలు
  • ఫోకస్
  • కలెక్షన్స్
  • వీడియోస్
Hot Now
  • #Open House with Dr. Rajashekhar
  • #VFX Supervisor Murali Manohar Reddy
  • #Kirrak Seetha Video Interview

Filmy Focus » Movie News » రైతుని అభిమానించే ప్ర‌తి వ్య‌క్తి గ‌ర్వ‌ప‌డే చిత్రం `జైసేన‌`: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ద‌ర్శ‌క‌నిర్మాత వి. స‌ముద్ర‌

రైతుని అభిమానించే ప్ర‌తి వ్య‌క్తి గ‌ర్వ‌ప‌డే చిత్రం `జైసేన‌`: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ద‌ర్శ‌క‌నిర్మాత వి. స‌ముద్ర‌

  • January 28, 2021 / 07:09 PM ISTByFilmy Focus
  • facebook
  • Twitter
  • whatsapp
  • Telegram
  • | Follow Us
  • Filmy Focus Google News
  • |
    Join Us
  • Join Us on WhatsApp

Join Us

రైతుని అభిమానించే ప్ర‌తి వ్య‌క్తి గ‌ర్వ‌ప‌డే చిత్రం `జైసేన‌`: ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో ద‌ర్శ‌క‌నిర్మాత వి. స‌ముద్ర‌

శ్రీకాంత్‌, సునీల్, తార‌క‌ర‌త్న‌, శ్రీ‌రామ్‌‌ ప్రధాన పాత్రల్లో శ్రీ కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్‌లను హీరోలుగా పరిచయం చేస్తూ వి.విజయలక్ష్మి, సుష్మారెడ్డి ఫిలిమ్స్ సమర్పణలో శివ మహాతేజ ఫిలిమ్స్‌ పతాకంపై వి. సముద్ర దర్శకత్వంలో వి. సాయి అరుణ్‌ కుమార్‌ నిర్మిస్తున్న చిత్రం ‘జై సేన’. ఇప్పటికే ఈ చిత్రం నుండి విడుద‌లైన టీజ‌ర్‌, ట్రైల‌ర్‌, పాటలకి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ చిత్రం జ‌న‌వ‌రి 29న విడుద‌ల‌కాబోతున్న సంద‌ర్భంగా `జైసేన` గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హైద‌రాబాద్ ద‌స‌ప‌ల్లా హోట‌ల్‌లో గ్రాండ్‌గా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మంలో..

ప్ర‌ముఖ నిర్మాత కె.కె. రాధామోహ‌న్ మాట్లాడుతూ – “స‌ముద్ర గారితో మా బేన‌ర్‌లో `అధినేత` సినిమా చేయ‌డం జ‌రిగింది. ఆ సినిమాలో కూడా మంచి సోష‌ల్ మెసేజ్ ఇచ్చాం. అప్ప‌టినుండి స‌ముద్ర గారితో మంచి అనుభందం ఉంది. ఆయ‌న చాలా స్పీడ్‌గా సినిమాలు తీస్తుంటారు. అలాగే ఆర్టిస్టుల నుండి మంచి పెర్‌ఫామెన్స్‌లు రాబ‌ట్టుకుంటారు. ఇప్పుడు శివ‌మ‌హాతేజ ఫిలింస్ బేన‌ర్‌లో స‌ముద్ర‌గారి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన `జైసేన` సినిమాని ప్రేక్ష‌కులు ఆద‌రించాల‌ని కోరుకుంటూ..టీమ్ అంద‌రికీ నా బెస్ట్ విషెస్ తెలుపుతున్నాను“ అన్నారు.

హీరో త‌నీష్ మాట్లాడుతూ – “జైసేన ట్రైల‌ర్ విజువ‌ల్స్ చూస్తుంటే గ‌తంలో వ‌చ్చిన బ్లాక్‌బ‌స్ట‌ర్ మూవీ `యువ` గుర్తుకువ‌స్తుంది. స‌ముద్ర‌గారు ఒక ఫ్యామిలి మెంబ‌ర్‌లా ఉంటారు. సాయి అరుణ్, నేను చాలా మంచి ఫ్రెండ్స్. ఈ సినిమాతో నిర్మాత‌గా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు. స‌ముద్ర గారి అన్ని సినిమాల్లో ఏదో ఒక మెసేజ్ ఉంటూ ఉంటుంది. రైతు గురించి యువ‌త‌ని ఇన్స్‌పైర్ చేసే విధంగా న‌లుగురు కొత్త వారితో ఈ సినిమా తెర‌కెక్కించ‌డం జ‌రిగింది. ఈ సినిమా పెద్ద హిట్ కావాల‌ని కోరుకుంటున్నారు“ అన్నారు.

ప్ర‌ముఖ నిర్మాత శోభారాణి మాట్లాడుతూ – “జైసేన చాలా ప‌వ‌ర్‌ఫుల్ టైటిల్‌. నేను ఈ సినిమా చూశాను. చాలా బాగుంది. ఈ మూవీలో ప్ర‌తి క్యారెక్ట‌ర్‌ని ప‌ర్‌ఫెక్ట్‌గా తీర్చిదిద్దారు. ప్ర‌తి ఫ్రేమ్‌లో స‌ముద్ర‌గారు ప‌డ్డ క‌ష్టం క‌నిపిస్తుంది. ఈ సినిమాకి మెయిన్ అట్రాక్ష‌న్ సునీల్ గారు. ఆయ‌న న‌ట‌న సినిమాకి మంచి ప్ల‌స్ అవుతుంది. శ్రీ‌కాంత్‌గారు, తార‌కర‌త్న, శ్రీ‌రామ్ స‌హా అంద‌రి క్యారెక్ట‌ర్స్ చాలా బాగున్నాయి. మంచి టీమ్ కుదిరింది. ఈ చిత్రం క‌చ్చితంగా చాలా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

నిర్మాత తుమ్మలపల్లి రాంసత్యనారాయణ మాట్లాడుతూ – “స‌ముద్ర ప్ర‌తి సినిమాని ఒక యజ్ఞంలాగా ఎంతో క‌ష్ట‌ప‌డి సినిమా తీస్తాడు. ఇంత మంది ప్ర‌ముఖ న‌టీన‌టుల‌తో తీసిన జైసేన సినిమా త‌ప్ప‌కుండా సూప‌ర్‌హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

నిర్మాత ప్ర‌తాని రామ‌కృష్ణ గౌడ్ మాట్లాడుతూ – “స‌ముద్ర నాకు మంచి మిత్రుడు. ఎంతో క‌ష్ట‌ప‌డి ఈ సినిమాని బ్ర‌హ్మండంగా తీశారు. ఇలాంటి గ‌ట్స్ ఉన్న డైరెక్ట‌ర్స్ ఇండ‌స్ట్రీలో ఉంటేనే ఇంకా మంచి మంచి సినిమాలు తీయ‌డానికి అవ‌కాశం ఉంటుంది. రైతు స‌బ్జెక్ట్‌తో చేసిన ఈ సినిమా పెద్ద విజ‌యం సాధించాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

కో ప్రొడ్యూస‌ర్ శిరీష్ రెడ్డి మాట్లాడుతూ – “స‌ముద్ర గారు వ‌న్ ఆఫ్ ది గ్రేట్ టెక్నీషియ‌న్‌. శ్రీ‌కాంత్‌గారు, సునీల్‌గారు, తారక‌ర‌త్నగారు‌, శ్రీ‌రామ్‌గారు ఈ సినిమాకి నాలుగు పిల్ల‌ర్స్‌. మా టీమ్ అంద‌రూ ఎంతో క‌ష్ట‌ప‌డి తీసిన జైసేన సినిమా పెద్ద హిట్ అవ్వాల‌ని కోరుకుంటున్నా“ అన్నారు. .

ద‌ర్శ‌క నిర్మాత వి. స‌ముద్ర మాట్లాడుతూ – “నేను ఆహ్వానించ‌గానే ఈ ఫంక్ష‌న్‌కి వ‌చ్చిన ప్ర‌తి ఒక్క‌రికీ హృద‌య‌పూర్వ‌క ధ‌న్య‌వాదాలు. జైసేన సినిమా చూసి రైతుని అభిమానించే ప్ర‌తి వ్య‌క్తి గ‌ర్వ‌ప‌డ‌తాడు. అలాగే ప‌వ‌న్ క‌ళ్యాణ్ గారి ప్ర‌తి అభిమాని గ‌ర్వ‌ప‌డే సినిమా ఇది. ఒక జ‌వాన్‌ని గౌర‌వించిన‌ట్టు రైతుని కూడా గౌర‌వించాలి అని చెప్పే చిత్ర‌మిది. నేను అడ‌గ‌గానే నా మీద అభిమానంతో ఈ సినిమాలో న‌టించిన శ్రీ‌కాంత్‌గారికి, సునీల్‌గారికి అలాగే తార‌క‌ర‌త్న‌, శ్రీ‌రామ్ గారికి ధ‌న్య‌వాదాలు. కొత్త వారైనా మా హీరోలు కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్ చ‌క్క‌గా న‌టించారు. జ‌న‌వ‌రి 29న థియేట‌ర్‌ల‌లో చాలా గ్రాండ్‌గా విడుద‌ల‌వుతున్న జైసేన చిత్రాన్ని బిగ్గెస్ట్ హిట్ చేయాల‌ని కోరుకుంటున్నాను“ అన్నారు.

హీరో సునీల్ మాట్లాడుతూ – “స‌ముద్ర గారు నా క్యారెక్ట‌ర్ గురించి చెప్ప‌గానే నాకు బాగా న‌చ్చి ఈ సినిమా చేయ‌డం జ‌రిగింది. నా పాత్ర‌కి చందు చాలా ప‌వ‌ర్‌ఫుల్ డైలాగ్స్ రాశారు. అలాగే ఈ సినిమాలో చాలా మంది కొత్త వారు న‌టించ‌డం జ‌రిగింది. వారంద‌రూ పెద్ద స్టార్స్ అవ్వాల‌ని కోరుకుంటున్నాను. రైతుల గురించి ఒక మంచి ఉద్దేశ్యంతో తీసిన ఈ సినిమా త‌ప్ప‌కుండా పెద్ద స‌క్సెస్ అవుతుంది. జ‌న‌వ‌రి 29 విడుద‌ల‌వుతున్న జైసేన సినిమా చూసి స‌ముద్ర గారి థాట్‌ని ఎంక‌రేజ్ చేస్తే.. ఆ రైతుకి మీరు తిరిగి ప్రాణం పోసిన‌ట్టే“ అన్నారు.

ఈ కార్య‌క్ర‌మంలో ద‌ర్శ‌క నిర్మాతలు ఆర్‌.ఎస్ శ్రీ‌నివాస్‌, ఆచంట గోపీనాథ్‌, దొరైరాజు, సుబ్బారెడ్డి, రాజ్‌పుత్ర్‌, బాపిరాజు, సురేష్ కొండేటి, హీరోలు శ్రీ కార్తికేయ, అభిరామ్‌, ప్రవీణ్‌, హరీష్‌ గౌతమ్, హీరోయిన్స్‌ ఆరాధ్య‌, ర‌చ‌యిత చందు మ‌రియు చిత్ర యూనిట్ పాల్గొని ప్ర‌సంగించారు.

Most Recommended Video

ఈ 10 మంది సినీ సెలబ్రిటీలకు తల్లులు వేరైనా తండ్రులు ఒకరే..!
సౌత్ లో సక్సెస్ అయిన టాక్ షోలు.. ఏ తారలు హోస్ట్ చేసినవంటే..!
వరల్డ్ రికార్డ్ కొట్టి.. టాలీవుడ్ స్థాయిని పెంచిన సెలబ్రిటీల లిస్ట్..!

Filmyfocus వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus

Tags

  • #Jaisena
  • #Srinkanth
  • #Suneel
  • #taraka ratna

Also Read

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

NTRNeel: దేవ కట్టా కి ‘డ్రాగన్’ కి సంబంధం ఏంటి?

related news

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

‘జోకర్’ చిత్ర ఫస్ట్ లుక్ విడుదల !!!

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

MAA: ఆ ‘MAA’లను నమ్మొద్దు.. ‘మా’ అధికారిక ప్రకటన.. ఏమైందంటే?

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

భీమ్లా నాయక్ డైరెక్టర్ సాగర్ కె చంద్ర చేతులు మీదుగా అగ్లీ స్టోరీ ట్రైలర్ విడుదల! మే 22 న ‘అగ్లీ స్టోరీ’ విడుదల!

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవితో తమిళ ముఖ్యమంత్రి విజయ్ తండ్రి చంద్రశేఖర్ డైరెక్ట్ చేసిన సినిమాలు ఇవే

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

trending news

11 hours ago
‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

‘సతీ లీలావతి’ ఎంతో ఎంటర్టైనింగ్‌గా ఉంటుంది.. కామెడీని అందరూ ఎంజాయ్ చేస్తారు – లావణ్య త్రిపాఠి కొణిదెల

13 hours ago
Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

Tollywood: ఫ్లాపుల సెగ.. తల్లితో గొడవ.. హీరోయిన్ షాకింగ్ డెసిషన్

13 hours ago
Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

Kalki2: సాయి పల్లవి కారణంగా ఆగిపోయిన ‘కల్కి 2’ షూటింగ్.. ఏమైందంటే?

22 hours ago
Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

Manjari Fadnis: ఎన్టీఆర్ హీరోయిన్.. ఇలా అయిపోయిందేంటి?

22 hours ago

latest news

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

Yellamma : ఎల్లమ్మ మూవీ లో హీరోయిన్ ఫిక్స్.. ఎవరంటే ?

17 hours ago
Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

Jana Nayagan: ‘జన నాయగన్’ కి ఇదే మంచి టైమ్

23 hours ago
Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

Lavanya Tripathi: మెగా కోడలికి పెద్ద పరీక్షే

23 hours ago
R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

R.B.Choudary: సీనియర్ స్టార్ నిర్మాత ఆర్.బి.చౌదరి మృతి

1 day ago
R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

R Balki: టాలీవుడ్‌ నుండి బాలీవుడ్‌ ఈ విషయం నేర్చుకోవాలి.. స్టార్ డైరక్టర్‌ కామెంట్స్‌ వైరల్‌

2 days ago
  • English
  • Telugu
  • Tamil
  • Hindi
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
  • Follow Us -

Copyright © 2026 | Tollywood Latest News | Telugu Movie Reviews

powered by veegam
  • About Us
  • Privacy Policy
  • Disclaimer
  • Contact Us
Go to mobile version