జనతా గ్యారేజ్…సూపర్ ‘హిట్’ కాదా??

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ డైనమిక్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో నటించిన తాజా చిత్రం ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమాకి బెనిఫిట్ షోల నుంచే కాస్త డివైడ్ టాక్ రావడంతో ఈ సినిమా హిట్ మరియు ఫ్లాప్ పై అనేక ఇక ఇకలు..పక పకలు వినిపిస్తున్నాయి. అయితే అసలు జనతా హిట్టా…ఫ్లాపా? అసలు జనతా సక్సెస్ రేట్ ఎంత అంటే ఒక్కొక్కరూ ఒక్కో మాట చెబుతున్నారు…ఒకరు క్లీన్ మూవీ అని చెబుతుంటే…మరొకరు ఇది అసలు ఎన్టీఆర్ సినిమానే కాదు అని అంటున్నారు. అభిమానులైతే కాస్త నిరాశపడినప్పటికీ కొత్త ఎన్టీఆర్ ను చూశాం అని చెప్పుకుంటున్నారు.

అయితే వీటన్నింటిపై స్పందించిన దర్శకుడు కొరటాల మాట్లాడుతూ…అవును నిజమే ఈ సినిమా బ్లాక్ బాష్టర్ కాదు….కానీ మంచి సినిమా, కలెక్షన్స్ పరంగా చూసుకుంటే చాలా బాగా ఉంది. ఇంకా చెప్పాలి అంటే డిస్‌ట్రిబ్యుటర్స్ అయితే ఫోన్ చేసి మరీ మేము సేఫ్, పెట్టిన పెట్టుబడి మొదటి వారంలోనే వచ్చేస్తుంది…అంటూ చెబుతున్నారు…మంచి సినిమా తీసి, మంచి సందేశాన్ని ఇవ్వాలి అన్న ఉద్దేశంతో ఈ సినిమాను తెరకెక్కించాము. ముఖ్యంగా ఎన్టీయార్‌, మోహన్‌లాల్‌ కాంబినేషన్‌లోని అన్ని సీన్లూ బాగున్నాయని అందరూ అంటున్నారు. ఈ సినిమా అభిమానులకే కాకుండా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చింది అని టాక్ వస్తుంది. పెద్దలందరూ కూడా ఫోన్ చేసి మరీ కంగ్రాట్స్ చెబుతున్నారు. మొత్తానికి అటు చేసి ఇటు చేసి…కాస్త మాస్ లెక్కలు తగ్గడంతో ఈ సినిమాకు డివైడ్ టాక్ వచ్చింది కానీ…అసలైతే…సినిమాని సినిమా పరంగా చూస్తే మాత్రం సినిమా చాలా క్లీన్ సినిమా అని చెప్పవచ్చు.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus