హిట్ దర్శకుడు కొరటాల శివ, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో రూపుదిద్దుకున్న యాక్షన్ ఎంటర్టైనర్ జనతా గ్యారేజ్. ఈ చిత్రం ఆడియో శుక్రవారం శిల్పకళా వేదికపై విడుదల చేశారు. రాక్ స్టార్ దేవీ శ్రీ ప్రసాద్ స్వరపరిచిన ఆరు పాటలను రామజోగయ్య శాస్త్రి రాశారు. ఈ ఆల్బమ్ లోని పాటలు ఎలా ఉన్నాయంటే..
01. ప్రణామం
ఆల్బమ్ లో తొలిగా వచ్చే “ప్రణామం” నంబర్ ఒన్ సాంగ్ గా నిలిచింది. తన సాహిత్యంతో రామజోగయ్య శాస్త్రి ప్రకృతికి సెల్యూట్ చేశారు. “నీ వెంత నేనెంత రవ్వంత .. ఎన్నో ఏళ్ళ ఈ సృష్టి చరిత ” వంటి లిరిక్స్ ఆకట్టుకుంటాయి. శంకర్ మహదేవన్ గాత్రం ఈ పాటను ఎక్కడికో తీసుకు పోయింది. హుషారైన బీట్ తో తారక్ స్పీడ్ ని దృష్టిలో ఉంచుకొని డీఎస్పీ కంపోజ్ చేశారు. ఈ పాటలో ముంబైలోని అందాలను మనం వెండితెరపై చూడనున్నాం.
02. రాక్ ఆన్ బ్రో
ఆల్బంలో కొత్తదనం కోసం చేసిన దేవి ప్రయత్నం రాక్ ఆన్ బ్రో పాటలో కనిపిస్తుంది. రాక్ అనగానే అనేక వాయిద్యాలను మిక్స్ చేయకుండా కొన్నింటిని ఉపయోగించి విజయం సాధించాడు. గాయకుడు రఘు దీక్షిత్ చేత ఈ పాటను పాడించి కొత్త ఫ్లేవర్ అద్దారు. ఈ సాంగ్ సంగీత అభిమానుల మనసుకు హత్తుకుంటుంది. వీనుల విందు అయినా ఈ పాటను కొరటాల శివ కేరళలో చిత్రీకరించి కనుల విందు చేయనున్నారు.
03. యాపిల్ బ్యూటీ
ప్రేయసి అందాలను నేటి యువకుడు ఎలా పొగుడు తాడో .. వాడుకలో ఉన్న పదాలతో రామజోగయ్య శాస్త్రి “దివి నుంచి దిగివచ్చావా యాపిల్ బ్యూటీ” పాటను రాసి నేటి యువతకు మంచి కానుకను అందించారు.
“నిన్ను చూసి కనిపెట్టడా న్యూటన్ గ్రావిటీ.. నువ్వు పుట్టక ముందు ఈ లోకం చీకటి” వంటి పొగడ్తలు సమంత కు సరిపోయేలా ఉంది. హిట్ గీతాలు ఆలపించిన యాజిన్ నైజర్, నేహా భాసినిలు ఈ సాంగ్ ని ఉత్సాహంగా పాడారు. ఇందులో తారక్ అద్భుతమైన స్టెప్పులను స్యామ్ అందాలను మనం వెండి తెరపై చూడవచ్చు.
04. జయహో జనతా
టైటిల్ సాంగ్ “జయహో జనతా”లో సినిమా కథను మొత్తం నింపారు రామజోగయ్య శాస్త్రి. ఇందులో “ధర్మం గెలవని చోట, తప్పదు కత్తుల వేట.. తప్పు ఒప్పేదో సంహారం తర్వాత” అనే సాహిత్యం రచయిత అనుభవాన్ని చాటుతుంది. ఈ పాటను సుక్విందర్ సింగ్, విజయ్ ప్రకాష్ లు ఆలపించిన తీరు అమోఘం. ఎమోషనల్ గా సాగుతూ ఈ పాట జయహో అనిపిస్తుంది.
05. నీ సెలవడిగి
ఈ సినిమా లో చిన్న పాట “నీ సెలవడిగి”. సందర్భానుసారంగా వచ్చే ఈ సాంగ్ అందరి హృదయాలను టచ్ చేస్తుంది. గాయని శ్వేతా మోహన్ ఎంతో ఫీల్ తో పాడిన ఈ పాట సైలంట్ కిల్లర్.
06. పక్కా లోకల్
మాస్ అభిమానుల కోసం డీఎస్పీ ఇచ్చిన ట్రీట్ “పక్కా లోకల్”. గీతా మాధురి, సాగర్ లు పక్కా లోకల్ వాయిస్ అందించి ఎనర్జీ నింపారు. రామజోగయ్య శాస్త్రి వాడిన పదాలకు గ్రామీణ ప్రజలకు తొందరగా కనెక్ట్ అవుతారు. అక్కడి జాతరలలో ఈ ఏడాది మొత్తం ఈ పాటే వినిపించంచడం ఖాయం. ఈ పాటకి కాజల్ అగర్వాల్ తన డ్యాన్స్ తో అదరగొట్టనుంది.
కథకు అవసరమైన సాహిత్యాన్ని అందించడంలో రామజోగయ్య శాస్త్రి వంద శాతం సక్సస్ అయ్యారు. వాటిలో ఒక్కొక్క పాటను ఒక్కో స్టయిల్ లో కంపోజ్ చేసి దేవీ శ్రీ ప్రసాద్ సినిమాకు బలమయ్యారు.