‘గ్యారేజ్’కి డ్యామేజ్ అయ్యిందా??

  • July 19, 2016 / 08:19 AM IST

ఈ ఏడాది ఇండస్ట్రీని షేక్ చేసే సినిమాల్లో ఒకటిగా బరిలోకి దిగనున్న సినిమా ‘జనతా గ్యారేజ్’. ఈ సినిమాపై యంగ్ టైగర్ అభిమానులు చాలా ఆశలే పెట్టుకున్నారు. మొదటి నుంచి ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే అదే క్రమంలో ఈ సినిమా ఫర్స్ట్ లుక్, టీజర్ రెండు ఈ సినిమాపై అంచనాలను తార స్థాయికి చేర్చేశాయి. ఇక త్వరలోనే సినిమా ఆడియో విడుదల కానుంది అన్న ఆనందంలో ఉన్న అభిమానులకు ఈ సినిమా విడుదల న్యూస్ గుండెల్లో రాయి పడినట్లుగా అనిపించింది.

అప్పటివరకూ ఈ సినిమాపై ఉన్న అంచనాలను అమాంతంగా నేలపై పడేసేలా చేసింది ఈ వాయిదా నిర్ణయం. ఇక అంతవరకూ ఒక ఎత్తు అయితే, ఈ సినిమా వాయిదా విషయాన్ని తెలిపే క్రమంలో దర్శకుడు కొరటాల మాట్లాడిన తీరు అనేక విమర్శలకు దారితీస్తుంది. సినిమా రీ టెక్ చేయడం నేరమా ? అంటూ కొరటాల చేసిన కామెంట్స్, దీనికితోడు జూనియర్ అభిమానులు తెరపైకి తీసుకు వచ్చిన సెంటిమెంట్లు కూడ ఈసినిమా బయ్యర్లను విపరీతంగా టార్చర్ పెడుతోంది అన్న వార్తలు బలంగా వినిపిస్తున్నాయి.

అంతేకాకుండా ఈ మధ్య పెద్ద హీరోల సినిమాలు వాయిదా పడటం పెడద్గ కలసిరాణి విషయంగా అనిపిస్తుంది. ఎందుకంటే…ఈ సమ్మర్ రేసుకు వచ్చిన ‘బ్రహ్మోత్సవం’ ‘సర్దార్ గబ్బర్ సింగ్’ లు కూడ రకరకాల కారణాలతో వాయిదాలు పడి ఆపై నెగిటివ్ రూమర్స్ తో విడుదలై ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో, ఈ సెంటిమెంట్ ‘జనతా గ్యారేజ్’ కు కూడ వర్తిస్తుందా ? అన్న భయంతో ఉన్నారు అభిమానులు. ఏది ఏమైనా..ఈ సినిమా వాయిదా నిర్ణయంతో కాస్త డ్యామేజ్ జరిగినట్లే కనిపిస్తుంది. మరి ఈ డ్యామేజ్ ను ఎన్టీఆర్ ఎలా కవర్ చేస్తాడో చూడాలి.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus