ముద్దంటూ పెడితే అది ఆ హీరోకే పెడతా : జాన్వీ కపూర్

అతిలోక సుందరి, దివంగత నటి అయిన శ్రీదేవి పెద్ద కుమార్తె జాన్వీ కపూర్ ప్రస్తుతం మంచి క్రేజీ భామగా మారిపోయింది. ‘ధడక్’ చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి మంచి హిట్ అందుకోవడంతో పాటూ తన నటనతో కూడా ప్రేక్షకులని కట్టి పడేసింది. ప్రస్తుతం గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తున్న ఈ భామ… ‘తక్త్’ అనే చిత్రంలో కూడా నటిస్తూ బిజీగా గడుపుస్తుంది. ఓ పక్క సినిమాలతో బిజీగా ఉంటూనే.. మరో పక్క సోషల్ మీడియాలో కూడా మంచి యాక్టివ్ గా ఉంటుంది. ఇప్పటీకే ఈమెకు మిలియన్ల ఫాలోవర్లు ఉండడం విశేషం. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన ఒక్క సంవత్సరంలోనే ఇంత క్రేజ్ సంపాదించుకున్న హీరోయిన్ మరొకరు లేరు అందంలో అతిశయోక్తి లేదు. తాజాగా ఓ టీవీ షోలో పాల్గొన్న జాహ్నవి కొన్ని ఆసక్తికరమైన విషయాలు తెలిపింది.

నేహా ధూపియా హోస్ట్ గా చేస్తున్న ‘బీఎఫ్ విత్ వోగ్’ షోలో తాజాగా జాన్వీ కపూర్ కూడా పాల్గొంది. ఇందులో భాగంగా… ముద్దు పెట్టుకునే అవకాశం వస్తే ఎవరికి..? అనే ప్రశ్నకి.. విక్కీ కౌశల్ , కార్తిక ఆర్యన్ లలో ఎవరికి ఇస్తారో ఎంపిక చేసుకోమంటే..? జాన్వీ.. ”విక్కీ కౌశల్” అంటూ జవాబిచ్చింది. ‘యూరి ది సర్జికల్ స్ట్రైక్’ చిత్రంతో క్రేజ్ సంపాదించుకున్న విక్కీ కౌశల్ కి యూత్ లో మంచి క్రేజ్ ఏర్పడింది. ఈ హీరోతో తొలిముద్దు కోసం వెయిట్ చేస్తోందట జాన్వీ. మరో ఆశ్చర్యకరమైన విషయమేమిటంటే.. జాన్వీ నటిస్తున్న ‘తక్త్’ సినిమాలో తనకి జోడీగా నటించేది కూడా విక్కీ కౌషలే.. అందుకే ఇలా తన పేరు చెప్పినట్టు స్పష్టమవుతుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus