Janhvi Kapoor: రౌడీహీరోతో జాన్వీ కపూర్ టాలీవుడ్ డెబ్యూ!

దివంగత నటి శ్రీదేవి కుమార్తె జాన్వీ కపూర్ ను హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం చేయాలని చాలా మంది దర్శకులు ప్రయత్నించారు. కానీ కుదరలేదు. బాలీవుడ్ లోనే ఆమె వరుస సినిమాలు చేస్తోంది. ఎన్టీఆర్, రామ్ చరణ్ లాంటి హీరోలతో ఆమె కలిసి నటించబోతుందంటూ వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదని తేలిపోయింది. ఇప్పుడు మరోసారి జాన్వీకపూర్ సౌత్ ఎంట్రీ వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈసారి జాన్వీకపూర్ తన అభిమాన హీరో సినిమాతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుందని వార్తలు వస్తున్నాయి.

ఆమె ఫేవరెట్ హీరో ఎవరనేది ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పటికే చాలా సార్లు విజయ్ దేవరకొండ అంటే తనకు చాలా ఇష్టమని.. అతడితో సినిమా చేసే ఛాన్స్ వస్తే అసలు వదులుకోనని చెప్పింది జాన్వీ. ‘కాఫీ విత్ కరణ్’ టాక్ షోలో ఆమె విజయ్ దేవరకొండ గురించి చెప్పింది. అయితే ఇప్పుడు కరణ్ జోహార్ నిర్మించబోయే సినిమాలో విజయ్ దేవరకొండ సరసన జాన్వీకపూర్ హీరోయిన్ గా నటించనుందట. తెలుగుతో పాటు హిందీ, ఇతర భాషల్లో ఈ సినిమాను విడుదల చేయనున్నారు.

దీనికి డైరెక్టర్ మరెవరో కాదు.. పూరి జగన్నాధ్. నిజానికి ప్రస్తుతం పూరి డైరెక్ట్ చేస్తోన్న ‘లైగర్’ సినిమాలో ముందుగా జాన్వీకపూర్ ను హీరోయిన్ గా అనుకున్నారు కానీ కుదరలేదు. ‘లైగర్’ తరువాత పూరి జగన్నాధ్ దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నాడు విజయ్ దేవరకొండ. ఈ సినిమాను కూడా పాన్ ఇండియా లెవెల్ లో చిత్రీకరించనున్నారు. ఇందులో హీరోయిన్ గా జాన్వీకపూర్ ను అనుకుంటున్నారు. దాదాపు ఆమెని తీసుకోవడం ఖాయమని తెలుస్తోంది. మరి ఈ వార్తల్లో ఎంతవరకు నిజముందో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే!

బంగార్రాజు సినిమా రివ్యూ & రేటింగ్!

Most Recommended Video

చైసామ్, ధనుష్- ఐస్ లు మాత్రమే కాదు సెలబ్రిటీల విడాకుల లిస్ట్ ఇంకా ఉంది..!
ఎన్టీఆర్ టు కృష్ణ.. ఈ సినీ నటులకి పుత్రశోఖం తప్పలేదు..!
20 ఏళ్ళ ‘టక్కరి దొంగ’ గురించి ఎవ్వరికీ తెలియని కొన్ని విషయాలు..!

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus