Janhvi Kapoor: దేవర షూట్ అప్డేట్ ఇచ్చిన జాన్వీ.. నా రోల్ ఇదేనంటూ?

  • February 22, 2024 / 09:24 PM IST

ఎన్టీఆర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న దేవర సినిమాకు సంబంధించి క్లారిటీ కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్ కు జాన్వీ కపూర్ నుంచి ఆ క్లారిటీ వచ్చేసింది. దేవర సినిమాకు సంబంధించి సాంగ్స్ బ్యాలెన్స్ ఉందని తాజాగా ఒక సందర్భంలో జాన్వీ కపూర్ చెప్పుకొచ్చారు. ఈ సినిమాలో మొత్తం 5 సాంగ్స్ ఉంటాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఇప్పటికే సాంగ్స్ కంపోజ్ పూర్తైందని జాన్వీ వెల్లడించారు. అనిరుధ్ వల్లే దేవర మూవీ ఆలస్యమవుతోందని గత కొంతకాలంగా ప్రచారం జరుగుతుండగా ఆ ప్రచారంలో ఏ మాత్రం నిజం లేదని జాన్వీ కపూర్ చెప్పకనే చెప్పేశారు.

అదే సమయంలో జాన్వీ దేవర మూవీ షూట్ తనకు కొత్త అనుభవాన్ని అందించిందని ఈ సినిమాలో నా పాత్ర వైవిధ్యంగా ఉంటుందని చెప్పుకొచ్చారు. ప్రతి సీన్ ను ముందుగానే తెలుసుకున్నానని ఆమె కామెంట్లు చేశారు. దేవర సినిమా అక్టోబర్ 10వ తేదీన రిలీజ్ కానుండగా ఈ సినిమా ఫ్యాన్స్ కు ఫుల్ మీల్స్ లా ఉండనుందని తెలుస్తోంది. దసరా పండుగ కానుకగా రిలీజవుతున్న ఈ సినిమాకు హిట్ టాక్ వస్తే మాత్రం కలెక్షన్లు భారీ రేంజ్ లో ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది.

టీజర్ లేదా ట్రైలర్ విడుదలైతే మాత్రం ఈ సినిమాపై అంచనాలు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయి. దేవర మూవీలో యాక్షన్ సీన్స్ సైతం స్పెషల్ గా ఉండబోతున్నాయని ఇండస్ట్రీ వర్గాల్లో వినిపిస్తోంది. ఫ్యాన్స్ అంచనాలను మించి ఈ సినిమా ఉంటుందని ఈ సినిమాలో ప్రేక్షకులు కొత్త ప్రపంచాన్ని చూస్తారని కామెంట్లు వినిపిస్తున్నాయి.

దేవర సినిమా రెండో పార్ట్ కూడా వేరే లెవెల్ లో ఉండబోతుందని భోగట్టా. సౌత్ లో (Janhvi Kapoor) జాన్వీ ఊహించని స్థాయిలో బిజీ అవుతారని ఫ్యాన్స్ చెబుతున్నారు. దేవర సినిమా ఫస్ట్ సింగిల్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

‘యానిమల్’ ఫైనల్ గా ఎంత కలెక్ట్ చేసింది.. లాభం ఎంత?

ఈ వారం థియేటర్/ ఓటీటీల్లో స్ట్రీమింగ్ కాబోతున్న 15 సినిమాలు/ సిరీస్ .. ల లిస్ట్.!
కోపంతో ఊగిపోయిన మిడ్ రేంజ్ హీరో.. ఏం అయ్యిందంటే?

Read Today's Latest Movie News Update. Get Filmy News LIVE Updates on FilmyFocus