డాడీకి తెలిస్తే నన్ను చంపేస్తారు : జాన్వీ కపూర్

‘ధడక్’ చిత్రంతో బాలీవుడ్ కు ఎంట్రీ ఇచ్చింది శ్రీదేవి కుమార్తె ‘జాన్వీ కపూర్’. ఈ చిత్రంలో తన నటనతో ప్రేక్షకుల నుండీ మంచి మార్కులు కొట్టేసింది. ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరో పక్క హాట్ హాట్ ఫోటో షూట్లు కూడా చేస్తుంది. ఇటీవల జాన్వీ ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్ ఫోటో షూట్ లో పాల్గొంది. అయితే ఈ ఫోటో షూట్.. ముందు చేసిన ఫోటో షూట్లకంటే చాలా భిన్నంగా ఉండడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. ఈ ఫోటోషూట్ కోసం జాన్వీ తన జుట్టుని చాలా చిన్నగా కత్తిరించుకోవడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా.. తను ఇలా జుట్టు కత్తిరించుకున్న సంగతి తన తండ్రి బోణీ కపూర్ కి తెలియదట. ఈ విషయం స్వయంగా జాన్వీ నే చెప్పింది. ఈ విషయం పై జాన్వీ మాట్లాడుతూ… ”నేను ఇలా ఫోటోషూట్ కోసం జుట్టు కత్తిరించుకున్నాను, ఈ విషయం మా డాడీకి తెలియదు. నన్ను ఇలా చూస్తే చంపేస్తారు” అంటూ చెప్పుకొచ్చింది జాన్వీ.ప్రస్తుతం జాన్వీ ఇప్పుడు ఐఏఎఫ్ మహిళా పైలట్ గుంజన్ సక్సేనా బయోపిక్ లో నటిస్తుంది. ఈ మధ్యే పైలట్ దుస్తుల్లో ఉన్న జాన్వీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంతో పాటు ఆమె ‘తక్త్’ అనే హిస్టారికల్ మూవీలో కీలక పాత్ర పోషిస్తుంది.

Read Today's Latest Featured Stories Update. Get Filmy News LIVE Updates on FilmyFocus