Laiగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొని జైలులో కొన్నాళ్లు ఉండి ఇటీవల బెయిల్ మీద బయటకు వచ్చారు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master). తొలినాళ్లలో తెలుగులో మాత్రమే సినిమాలు చేస్తూ వచ్చిన ఆయన ఆ తర్వాత పాన్ ఇండియా కొరియోగ్రాఫర్ అయ్యారు. తెలుగుతోపాటు హిందీ, తమిళం, కన్నడ సినిమాల్లో స్టార్ హీరోలకు కొరియోగ్రఫీ చేశారు. అయితే ఆయన జైలు నుండి వచ్చాక సరైన అవకాశం రాలేదు. కానీ ఇప్పుడు శాండిల్ వుడ్ నుండి తొలి పిలుపు వచ్చింది.
జైలు నుండి బయటకు వచ్చిన తర్వాత కొన్ని రోజులకు జానీ మాస్టర్ తిరిగి కొరియోగ్రఫీకి సిద్ధం అని ప్రాక్టీస్ వీడియోలు ఎక్స్‌లో పోస్ట్ చేశారు. దీంతో మళ్లీ ఆయన స్టైల్ డ్యాన్స్ చూస్తాం అని ఫ్యాన్స్ ఆశించారు. కానీ తెలుగు, హిందీలో ఆయన సినిమాలు కొత్తవి ఏవీ ఓకే అయినట్లు తెలియలేదు. ఈ సమయంలో శాండిల్ వుడ్‌లో ఓ సినిమా ఓకే అయింది. ఆయన రీసెంట్‌గా సెట్స్‌లో అడుగుపెట్టారు కూడా. దీనికి సంబంధించిన వీడియోను ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘యువర్స్ సిన్సియర్లీ రామ్’ అనే ఓ సినిమాకు జానీ మాస్టర్ పని చేస్తున్నారు. ఈ సినిమా సెట్‌కు జానీ వెళ్లగా అక్కడ ఊహించని స్వాగతం లభించింది. గుమ్మడి కాయతో దిష్టి తీసి హారతిచ్చి సెట్స్‌లోకి ఆహ్వనించారు. అనంతరం కేక్ కట్ చేయించి వెల్కమ్ చెప్పారు. ఘన స్వాగతం చూసి జానీ మాస్టర్ ఎమోషనల్ అయ్యారు. అందరికీ థ్యాంక్స్ చెబుతూ కన్నీళ్లు కూడా పెట్టుకున్నారు.
చాలా రోజుల తర్వాత బెంగళూరులో అడుగుపెట్టాను. నన్ను సపోర్ట్ చేసి అవకాశం ఇచ్చిన సినిమా టీమ్‌కి రుణపడి ఉంటాను అని జానీ మాస్టర్ పోస్టులో రాసుకొచ్చారు. అంతకుముందు ఆయన దివంగత ప్రముఖ నటులు రాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్ స్మారకాల వద్దకు వెళ్లి ఆశీస్సులు తీసుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను కూడా ఆయన ఎక్స్ అకౌంట్‌లో షేర్ చేశారు. ఇప్పుడు ఆ ఫొటోలు వైరల్‌గా మారాయి.
Stepped into #Bangalore after a verly long time and I’m extremely overwhelmed by the warm welcome on the sets of #YoursSincerelyRaam ❤️
Extremely grateful to each and everyone from the Team for the opportunity and support@Official_Ganesh @Ramesh_aravind #VikyathAR… pic.twitter.com/AJzIZ4c1Ra
— Jani Master (@AlwaysJani) February 3, 2025